నోటీస్‌బోర్డు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌

Published : 28 Jun 2021 01:10 IST

ప్రవేశాలు

ఏపీ ఈఏపీసెట్‌-2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ నిర్వహిస్తోంది.

కోర్సులు:  ఇంజినీరింగ్‌, బయోటెక్నాకలజీ, బీటెక్‌, బీఎస్సీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జులై 25, 2021. వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/APSCHEHome.aspx


ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) 2021-2022 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి, ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) ఐదో తరగతి ప్రవేశాలు మొత్తం సీట్లు: అన్ని జిల్లాల్లో కలిపి 2480.

2) ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు మొత్తం సీట్లు తరగతుల వారీగా: ఆరు-582, ఏడు-135, ఎనిమిది-121, తొమ్మిది-145. మీడియం: ఇంగ్లిష్‌ అర్హత: ఆయా తరగతిలో ప్రవేశాలను అనుసరించి నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: లక్కీ డ్రా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2021  వెబ్‌సైట్‌: http://apgpcet.apcfss.in/


ఏపీ ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌- 2021

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని 10 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌-2021 ప్రకటన విడుదల చేసింది.

1) ఏపీఆర్‌జేసీ 2021-2022 అర్హత: 2020-2021 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత.

2) ఏపీఆర్‌డీసీ 2021-2022 అర్హత: 2021లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: మెరిట్‌/ లక్కీ డ్రా ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జులై 15, 2021. వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీలో 3211 గ్రామ/ వార్డ్‌ వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వివిధ జిల్లాల్లో గ్రామ/ వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3211 జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం: 576, తూర్పు గోదావరి: 367, పశ్చిమ గోదావరి: 432, కర్నూలు: 58, అనంతపురం: 1480, విజయనగరం: 298. అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. స్థానిక గ్రామ/ వార్డ్‌ పరిధిలో నివసిస్తూ ఉండాలి. వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఆయా జిల్లాలను అనుసరించి చివరి తేదీలు వేరు వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌: https://apgv.apcfss.in/FirstPage.do


తెలంగాణ గురుకులాల్లో 110 సబ్జెక్ట్‌ అసోసియేట్లు

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్‌ సొసైటీలకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కాలేజీల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన జేఈఈ మెయిన్స్‌/ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ అండ్‌ ఎంసెట్‌ శిక్షణ కోసం పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 110 రెండు సొసైటీల్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు: మ్యాథ్స్‌ 16, ఫిజిక్స్‌ 20, కెమిస్ట్రీ 24, బోటనీ 23, జువాలజీ 24, సివిక్స్‌ 02, ఎకనమిక్స్‌ 01. అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాతపరీక్ష, సంబంధిత సబ్జెక్టులో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, డెమో/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.500. జీతభత్యాలు: నెలకి రూ.25000 చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేది: జులై 01, 2021. వెబ్‌సైట్‌: www.tgtwgurukulam.telangana.gov.in/


బీఎస్‌ఎఫ్‌లో 110 పారామెడికల్‌, వెటర్నరీ స్టాఫ్‌

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ఎస్‌ఐ(స్టాఫ్‌నర్సు), ఏఎస్‌ఐ టెక్నీషియన్‌, సీటీ వార్డ్‌బాయ్‌, హెచ్‌సీ(వెటర్నరీ), కానిస్టేబుల్‌. అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ/ డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు. వెబ్‌సైట్‌: https://bsf.gov.in/Home


వాక్‌ఇన్‌

డీఎంహెచ్‌ఓ-కర్నూలులో 34 పారామెడికల్‌ స్టాఫ్‌

జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం(డీఎంహెచ్‌వో) వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34 పారామెడికల్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లు అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ), డిప్లొమా/ బీఎస్సీ(ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణత. పారామెడికల్‌ ఆఫ్తాల్మిక్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఇంటర్వ్యూ వేదిక: డీఎంహెచ్‌ఓ, కర్నూలు జిల్లా.

ఇంటర్వ్యూ తేది: జూన్‌ 30, 2021.

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in/notice_category/recruitment/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని