Updated : 19 Jul 2021 02:28 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎస్‌ఎస్‌సీ-25,271 కానిస్టేబుల్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్ర భద్రత బలగాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హుల నుంచి  దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25,271 * సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) కానిస్టేబుల్‌(జీడీ), ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మెన్‌(జీడీ)

విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌-7545, సీఐఎస్‌ఎఫ్‌-8464, ఎస్‌ఎస్‌బీ-3806, ఐటీబీపీ-1431, ఏఆర్‌-3785,  ఎస్‌ఎస్‌ఎఫ్‌-240.

అర్హత: ఆగస్టు 01, 2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఆగస్టు 01, 2021 నాటికి 18 - 23 ఏళ్లు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 31.

పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది. https://ssc.nic.in/


నాబార్డ్‌లో 162 ఆఫీసర్స్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) ఆఫీసర్స్‌ గ్రేడ్‌ ఏ/ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆఫీసర్స్‌ గ్రేడ్‌ ఏ/ బీ - 2021

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ-148, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ-05, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ-02, మేనేజర్‌ గ్రేడ్‌ బి-07.

విభాగాలు: రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌, రాజ్‌భాష సర్వీస్‌, ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 07.

వెబ్‌సైట్‌: https://www.nabard.org/


ప్రవేశాలు

ఏపీ పీజీఈసెట్‌-2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికిగాను పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ ప్రకటన విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది.

* ఏపీపీజీఈసెట్‌ -2021 కోర్సులు: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మాడీ (పీబీ).

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబరు 27 నుంచి 30 వరకు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, జులై 19.

దరఖాస్తుకు చివరితేది: 2021, ఆగస్టు 19.

వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/


ఏపీ ఎడ్‌సెట్‌ - 2021

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ)

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా.

పరీక్ష తేది: 21.09.2021. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 17.

వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/EDCET


వాక్‌ఇన్‌

డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌ - 327 పోస్టులు

హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం హైదరాబాద్‌ జిల్లాలోని మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌, టీవీవీపీ హాస్పిటల్స్‌లో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 327

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-180, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌)-140, జీడీఎంఓ-07.

వాక్‌ఇన్‌ తేదీలు: 2021, జులై 20, 23, 24. వేదిక: హరిహర కళా భవన్‌, ప్యాట్నీ, సికిందరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts