నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ మెడికల్‌ కాలేజీ(ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 09 Aug 2021 06:44 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ-హైదరాబాద్‌లో 237 పోస్టులు

భారత ప్రభుత్వ ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ మెడికల్‌ కాలేజీ(ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 237

పోస్టులు - ఖాళీలు: ఫ్యాకల్టీ-53, సూపర్‌ స్పెషలిస్ట్‌- 24, సీనియర్‌ రెసిడెంట్లు-124, జూనియర్‌ రెసిడెంట్లు-36.

విభాగాలు: ప్రొఫెసర్లు, ప్రి క్లినికల్‌, పారా క్లినికల్‌ స్టాఫ్‌, జూనియర్‌ కన్సల్టెంట్‌ తదితరాలు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 20.

వెబ్‌సైట్‌: www.esic.nic.in/


ఐఏఎఫ్‌ - 197 గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఏర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/ యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 197

పోస్టులు: సూపరింటెండెంట్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్‌, కార్పెంటర్‌, ట్రేడ్స్‌మెన్‌ మెట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, పని అనుభవం.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌/ ఫిజికల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2021, ఆగస్టు 07-13)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/


ప్రవేశాలు

ఏపీసెట్‌ - 2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) ప్రకటనను విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీసెట్‌) - 2021

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, ఆగస్టు 11.

దరఖాస్త్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 13.

పరీక్ష తేది: 2021, అక్టోబరు 31.

వెబ్‌సైట్‌: https://apset.net.in/


పీజేటీఎస్‌ఏయూలో డిప్లొమా కోర్సులు

హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌)లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (రెండేళ్లు), డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ కల్చర్‌ (రెండేళ్లు), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (మూడేళ్లు).

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌ 2021 పరీక్ష రాసి ఉండాలి.

వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పాలీసెట్‌ 2021 అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్త్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 26.

వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in/


టీఎస్‌ డీఈఈసెట్‌-2021

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌ ప్రకటన విడుదలైంది.

* టీఎస్‌ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ డీఈఈసెట్‌)

కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2021 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయః పరిమితి లేదు.

ఎంపిక: టీఎస్‌ డీఈఈసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 25.

టీఎస్‌ డీఈఈసెట్‌ 2021 పరీక్ష తేది: 2021, సెప్టెంబరు 08.

వెబ్‌సైట్‌: http://deecet.cdse.telangana.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని