నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) 2021-2022 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 30 Aug 2022 11:45 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూబీఐలో 347 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) 2021-2022 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 347 పోస్టులు - ఖాళీలు: సీనియర్‌ మేనేజర్లు-60, మేనేజర్లు-141, అసిస్టెంట్‌ మేనేజర్లు-146, విభాగాలు: రిస్క్‌, సివిల్‌ ఇంజినీర్‌, ఆర్కిటెక్ట్‌, ఆర్కిటెక్ట్‌ ఇంజినీర్‌, ప్రింటింగ్‌ టెక్నాలజిస్ట్‌, ఫోరెక్స్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/ సీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు. ఇతరులు రూ.850 చెల్లించాలి.  దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 03.
వెబ్‌సైట్‌:
‌www.unionbankofindia.co.in/


యూపీఎస్సీ- 151 డిప్యూటీ డైరెక్టర్లు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిప్యూటీ డైరెక్టర్లు

మొత్తం ఖాళీలు: 151 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌/ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 02. వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఎస్‌బీఐలో 68 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్స్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 68 పోస్టులు - ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌-50, డిప్యూటీ మేనేజర్‌-10, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ -06, ప్రొడక్ట్‌ మేనేజర్‌- 02. విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, అగ్రికల్చర్‌ స్పెషల్‌, ఓఎంపీ.  అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్‌)/ పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 01.04.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు. దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 02. పరీక్ష తేది: 2021, సెప్టెంబరు 25. వెబ్‌సైట్‌: https://sbi.co.in/


డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌లో 96 స్టాఫ్‌ నర్సులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పథకాల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్టాఫ్‌ నర్సులు

మొత్తం ఖాళీలు: 96 పథకాల వారీగా ఖాళీలు: బస్తీ దవాఖానా-22, ఎన్‌హెచ్‌ఎం-24, ఎస్‌సీయూ/ ఎన్‌బీఎస్‌యూ-50. అర్హత: జీఎన్‌ఎం/ బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 16. చిరునామా: డీఎంహెచ్‌ఓ, నాలుగో అంతస్తు, హరిహర కళాభవన్‌, ప్యాట్నీ, సికిందరాబాద్‌.https://hyderabad.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని