నోటీస్‌బోర్డు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Aug 2021 00:49 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

కడప జిల్లా అంగన్‌వాడీల్లో 288 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 288 పోస్టులు - ఖాళీలు: అంగన్‌వాడీ కార్యకర్త-50, అంగన్‌వాడీ సహాయకురాలు-225, మినీ అంగన్‌వాడీ కార్యకర్త-13. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్‌ ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31. చిరునామా: స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌.
వెబ్‌సైట్‌:
https://kadapa.ap.gov.in/


ఐఏఎఫ్‌లో 175 గ్రూప్‌ సి పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఏర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) వివిధ విభాగాల్లో గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 175 పోస్టులు: కార్పెంటర్‌, ఎంటీఎస్‌, కుక్‌, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం, టైపింగ్‌. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌/ ఫిజికల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (ఆగస్టు 21-27)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.  

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/


పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జమ్మూలోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 26 విభాగాలు - ఖాళీలు: ఎల‌్రక్టికల్‌-23, సివిల్‌-03. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాతపరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 18.

వెబ్‌సైట్‌: www.powergrid.in/


ప్రవేశాలు

ఆర్‌జీయూకేటీ సెట్‌ - 2021

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) 2021 - 2022 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆర్‌జీయూకేటీ సెట్‌ - 2021 )

ఏపీ ఆర్‌జీయూకేటీ ప్రాంగణాలు: నూజివీడు, ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. కోర్సు వ్యవధి: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాం. ప్రీ యూనివర్సిటీ కోర్సు (రెండేళ్లు), బీటెక్‌ (నాలుగేళ్లు) అర్హత: మొదటి ప్రయత్నంలో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. వయసు: 31 డిసెంబరు 2021 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపిక విధానం: ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆఫ్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 06. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 11. పరీక్ష తేది: సెప్టెంబరు 26.

https://rgukt.in/


స్కాలర్‌షిప్స్‌

డీఓఎస్‌జేఈ-ఉచిత శిక్షణకు ఆర్థిక సాయం

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం (డీఓఎస్‌జేఈ) ఎస్సీ, ఒబీసీ విద్యార్థులకు (కుటుంబ వార్షికాదాయం రూ.8.00 లక్షలకు మించకూడదు) వారు ఎంచుకున్న విభాగంలో ఉచిత శిక్షణకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల ఉచిత శిక్షణకు ఆర్థికసాయం

సీట్ల సంఖ్య: 1500 స్టైపెండ్‌: స్థానిక విద్యార్థులకు- రూ.3వేలు, స్థానికేతరులకు-రూ.6వేలు. దివ్యాంగులకు రూ.2వేలు ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 10.
వెబ్‌సైట్‌:
http://coaching.dosje.gov.in/


వాక్‌ఇన్స్‌

ఐఐసీటీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 07 పోస్టులు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఫార్మ్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌, అనుభవం. వాక్‌ఇన్‌ తేది: ఆగస్టు 27.
వాక్‌ఇన్‌ వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, హైదరాబాద్‌-500007.
వెబ్‌సైట్‌:
www.iictindia.org/

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని