Updated : 30 Aug 2021 06:25 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

సీఈఆర్‌ఐలో 54 టెక్నికల్‌ స్టాప్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని కరైకుడికి చెందిన సెంట్రల్‌ ఎల‌్రక్టోకెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఐఆర్‌ఐ) శాశ్వత ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 54 పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌. అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం. వయసు: 28 ఏళ్లు మించకూడదు. జీతభత్యాలు: నెలకు రూ.19900 నుంచి రూ.50448 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 27, 2021 వెబ్‌సైట్‌:
www.cecri.res.in/Default.aspx


ఏపీఈపీడీసీఎల్‌లో 398 జూనియర్‌ లైన్‌మెన్లు

విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఏపీఈపీడీసీఎల్‌) గ్రామ/ వార్డ్‌ సెక్రటేరియట్స్‌ కింద వివిధ జిల్లాల్లో పని చేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 398
* ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ 2)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021.
వెబ్‌సైట్‌:
https://apeasternpower.com/


చిత్తూరు జిల్లా-అంగన్‌వాడీల్లో 484 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 20 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 484
అంగన్‌వాడీ కార్యకర్త: 110 మినీ అంగన్‌వాడీ కార్యకర్త: 65 అంగన్‌వాడీ సహాయకురాలు: 309 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయసు: జులై 01, 2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకి రూ.11500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకి రూ.7000, అంగన్‌వాడీ సహాయకురాలికి నెలకి రూ.7000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్‌ ఇంటర్వ్యూ, ఇతర వివరాలను ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 09, 2021.
చిరునామా: ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం చిత్తూరు.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సపోర్ట్‌ స్టాఫ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖండ్వా జోనల్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 18 పోస్టులు: వాచ్‌మెన్‌ కమ్‌ గార్డెనర్‌, ఆఫీస్‌ అటెండెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఫ్యాకల్టీ. ఖాళీలున్న ప్రదేశాలు: ఖండ్వా, ఖార్గోన్‌, బుర్హాన్‌పూర్‌. అర్హత: 8వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ (బీఎస్‌డబ్ల్యూ/బీఏ/బీకాం) ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌, హిందీ, కంప్యూటర్‌ నైపుణ్యాలు, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌/ ప్రజెంటేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 08, 2021. చిరునామా: జోనల్‌ మేనేజర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఖండ్వా జోనల్‌ ఆఫీస్‌, ఆనంద్‌నగర్‌, ఖండ్వా-450001.

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/Career


ఎయిమ్స్‌-బీబీనగర్‌లో ప్రొఫెసర్లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీబీనగర్‌కు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 22.
ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌-01 రీడర్‌/ అసోసియేట్‌ ప్రొఫెసర్‌-02 లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-03 ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌-15 రిజిస్ట్రార్‌-01

అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:
https://aiimsbibinagar.edu.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని