నోటీస్‌బోర్డు

కేంద్ర సర్వీసుల్లో జియాలజిస్టు తదితర గ్రూప్‌ ఎ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామ్‌-2022 ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది...

Published : 27 Sep 2021 01:48 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎస్‌ఎస్‌సీ - 3261 సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పోస్టులు: గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2), గ్రాడ్యుయేషన్‌, ఆపై ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 25.

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


యూపీఎస్సీ- ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2022

మొత్తం ఖాళీలు: 247

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌-ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.

ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 2022, ఫిబ్రవరి 20.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 12.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


యూపీఎస్సీ-కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామ్‌ 2022

కేంద్ర సర్వీసుల్లో జియాలజిస్టు తదితర గ్రూప్‌ ఎ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామ్‌-2022 ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది.

* కంబైన్డ్‌ జియోసైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌, 2022 

మొత్తం ఖాళీలు: 192

పోస్టులు: జియాలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌, కెమిస్ట్‌, సైంటిస్ట్‌ బి.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌ టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ప్రిలిమినరీ పరీక్ష తేది: 2022, ఫిబ్రవరి 20.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 12.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఏపీపీఎస్సీ- ఆయుష్‌లో 151 మెడికల్‌ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం (ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 151

1) ఆయుర్వేద: 72 (క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు-13, తాజా ఖాళీలు-59)

2) హోమియోపతి: 53 (క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు-01, తాజా ఖాళీలు-52)

3) యునాని: 26 (క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు-21, తాజా ఖాళీలు-05)

అర్హత: ఆయుర్వేద, హోమియోపతి, యునానీలోలో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్‌, సంబంధిత విభాగంలో మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా నమోదై ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, అక్టోబరు 04.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 25.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ప్రవేశాలు
జేఎన్‌వీల్లో ఆరో తరగతి..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2022 - 2023 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎన్‌వీఎస్‌ - జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

వయసు: 01.05.2009 - 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: 30 ఏప్రిల్‌, 2022.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 30.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు