Updated : 04 Oct 2021 06:10 IST

నోటిస్ బోర్డు 

ప్రభుత్వ ఉద్యోగాలు


ఏపీపీఎస్సీ - 10 పోస్టులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏపీ సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌, సమాచార సర్వీస్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10, పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ డైరెక్టర్లు-06, డీపీఆర్‌ఓ-04. అర్హత: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌, డీపీఆర్‌ఓ పోస్టులకి ఏదైనా డిగ్రీ/ జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ,  ఉత్తీర్ణత. వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అసిస్టెంట్‌ డైరెక్టర్లు- 2021, అక్టోబరు 22. డీపీఆర్‌ఓ పోస్టులు-2021, అక్టోబరు 19. దరఖాస్తులకు చివరి తేది: అసిస్టెంట్‌ డైరెక్టర్లు- 2021, నవంబరు 12 డీపీఆర్‌ఓ పోస్టులు-2021, నవంబరు 09.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in/


ఇండియన్‌ నేవీ - 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ

ఇండియన్‌ నేవీ...2022 జనవరిలో ప్రారంభమయ్యే 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (పర్మనెంట్‌ కమిషన్‌) కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
బి 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం (పర్మనెంట్‌ కమిషన్‌) 
మొత్తం ఖాళీలు: 35 (ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: 05, ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: 30) అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులతో సీనియర్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌ (10+2) ఉత్తీర్ణత, జేఈఈ (మెయిన్‌)-2021 స్కోరు. వయసు: జులై 2, 2002 - జనవరి 1, 2005 మధ్య జన్మించాలి. ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్‌) ర్యాంక్‌ 2021, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్‌/ కోల్‌కతా/ విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 10, 2021
వెబ్‌సైట్‌: 
https://www.joinindiannavy.gov.in/


35 మెడికల్‌ ఆఫీసర్లు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) పల్లె దవఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 35, అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 12. చిరునామా: డీఎంహెచ్‌ఓ, బీ బ్లాక్‌, కలెక్టర్‌ కాంప్లెక్స్‌ మొదటి అంతస్తు, కీసర, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా-501301.
వెబ్‌సైట్‌:
https://medchalnmalkajgiri.telangana.gov.in/


ప్రవేశాలు


నిమ్స్‌- మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు

హైదరాబాద్‌ (పంజాగుట్ట)లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) 2021 విద్యాసంవత్సరానికి కింది మాస్టర్స్‌ ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ)

విభాగాలు: మస్క్యులోస్కెలిటల్‌ సైన్సెస్‌, కార్డియోవాస్క్యులార్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్‌, న్యూరో సైన్సెస్‌. కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు. అర్హత: ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, 6 నెలల ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 16. దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: అక్టోబరు 20.
వెబ్‌సైట్‌:
 https://www.nims.edu.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని