ఐఏఎఫ్‌లో 83 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 01 Nov 2021 05:57 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 83, పోస్టులు: ఎల్‌డీసీ, ఎంటీఎస్‌, సూపరింటెండెంట్‌ (స్టోర్‌), సీఎంటీడీ, కుక్‌. అర్హత:  పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తర్ణత, అనుభవం, నిర్దిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ (2021, అక్టోబరు 30 - నవంబరు 05) న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడి తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:
https://indianairforce.nic.in/


పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, ఏపీ సర్కిల్‌

భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ విభాగం స్పోర్ట్స్‌ కోటా ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 75, పోస్టులు: పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్టుమ్యాన్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌. క్రీడాంశాలు: ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌, బాడీ బిల్డింగ్‌, చెస్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. జాతీయ/ అంతర్జాతీయ/ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించడడంతో పాటు స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 27.

వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in/


ఎన్‌ఏఆర్‌ఎల్‌, చిత్తూరులో...

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన చిత్తూరులోని నేషనల్‌ అట్మాస్పిరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 14, పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌/ ఇంజినీర్‌-01, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-13, అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జెస్ట్‌ పరీక్షల్లో అర్హత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 29.

వెబ్‌సైట్‌: https://www.narl.gov.in/


ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్లు

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో కింది పోస్టుల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తులు కోరుతోంది.
* డిప్యూటీ మేనేజర్లు (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)
మొత్తం ఖాళీలు: 17, అర్హత: బ్యాచిలర్‌ ఇన్‌ కామర్స్‌/ సీఏ/ సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌/ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 29.

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని