90 రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....

Updated : 08 Nov 2021 06:29 IST

ప్రభుత్వ ఉద్యోగాలు


90 రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 90 పోస్టులు: డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: www.asrb.org.in/


ఏపీఎండీసీ, విజయవాడ

విజయవాడ (ఏపీ)లోని ది ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10 పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ తదితరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు సీఏ, ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021 డిసెంబరు 03.

వెబ్‌సైట్‌: https://apmdc.ap.gov.in/


డీఎంహెచ్‌ఓ-విశాఖపట్నంలో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్టు డాక్టర్లు

మొత్తం ఖాళీలు: 126 విభాగాలు: గైనకాలజీ, జిరియాట్రిక్‌, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, స్కిన్‌, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ సర్జరీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీజీఓ/ డీసీహెచ్‌ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డీఎంహెచ్‌ఓ, విశాఖపట్నం.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 10.

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


వాక్‌-ఇన్స్‌
సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో 60 పోస్టులు

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డ్‌ (సీఎస్‌బీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 60 పోస్టులు-ఖాళీలు: ట్రెయినర్‌-30, ట్రెయినింగ్‌ అసిస్టెంట్‌-30.

అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్‌/ ఐటీఐ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 17.

వెబ్‌సైట్‌: https://csb.gov.in/


అప్రెంటిస్‌లు
నావల్‌ డాక్‌యార్డ్‌, విశాఖపట్నంలో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 275 ట్రేడులు: ఎల‌్రక్టీషియన్‌, ఎల‌్రక్టానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

రాత పరీక్ష తేది: 2022, జనరవరి 27.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 05.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: డిసెంబరు 14.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని