Updated : 06 Dec 2021 06:30 IST

బెల్‌, మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), మచిలీపట్నం(ఏపీ) యూనిట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 15

విభాగాల వారీగా ఖాళీలు: ఎల‌్రక్టానిక్స్‌-06, మెకానికల్‌-06, కంప్యూటర్‌ సైన్స్‌-03.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 01.11.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.35000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు

చివరి తేది: 2021, డిసెంబరు 24.

చిరునామా: భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రోడ్‌, మచిలీపట్నం 521001, ఏపీ.

వెబ్‌సైట్‌: www.bel-india.in/


ఎస్‌వీఆర్‌ఆర్‌ జీజీహెచ్‌, తిరుపతిలో....

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) చిత్తూరు జిల్లా, తిరుపతిలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో (జీజీహెచ్‌)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 138

పోస్టులు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, బయో-మెడికల్‌ ఇంజినీర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, జీఎన్‌ఎం, డిప్లొమా/ బీఎస్సీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 15.

చిరునామా: సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఏపీ.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/


ప్రవేశాలు

నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* నిఫ్ట్‌లో బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 2022

బ్యాచిలర్‌ ప్రోగ్రాములు (బి.డిజైన్‌): యాక్ససరీస్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ తదితరాలు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌): అపెరల్‌ ప్రొడక్షన్‌ మాస్టర్స్‌ ప్రోగ్రాములు: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ. పీహెచ్‌డీ ప్రోగ్రాములు

అర్హత: ప్రోగ్రాములని అనుసరించి ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: బ్యాచిలర్‌ ప్రోగ్రాములకు 24 ఏళ్లు మించకూడదు, మాస్టర్స్‌ ప్రోగ్రాములకు వయసుతో సంబంధం లేదు.  

ఎంపిక విధానం: రాత పరీక్ష-(క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌(సీఏటీ), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ), సిచువేషన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: యూజీ/ పీజీ ప్రోగ్రాములకు - 2022, జనవరి మొదటి వారం.

వెబ్‌సైట్‌: https://nift.ac.in/


డీఎంఈ, తెలంగాణ - జీఎన్‌ఎం ట్రెయినింగ్‌ కోర్సు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల (స్త్రీ, పురుషుల) నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రెయినింగ్‌ కోర్సు

కోర్సు వ్యవధి: మూడేళ్లు.

అర్హత: ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. ఏఎన్‌ఎంలో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 31.12.2021 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 13.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2021, డిసెంబరు 18.

చిరునామా: డీఎంఈ, కోఠి, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/


సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌, జూన్‌ 2021

సైన్స్‌, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్‌ఎఫ్‌, లెక్చర్‌షిప్‌ అర్హతకు నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

* సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌, జూన్‌ 2021

పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ఎంఎస్‌/ నాలుగేళ్ల బీఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 02.

పరీక్ష తేది: 2022, 29 జనవరి, 05, 06 ఫిబ్రవరి.

వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in/


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని