నోటీస్‌బోర్డు

ఎస్‌బీఐ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 13 Dec 2021 06:33 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐ - 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

ఎస్‌బీఐ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ల ఖాళీలు: 1226 (రెగ్యులర్‌-1100, బ్యాక్‌లాగ్‌-126)

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.12.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌), స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 29.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/


ఇండియన్‌ నేవీ సెయిలర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ 2022 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్‌ - స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ - 01/ 2022 బ్యాచ్‌

పోస్టులు: డైరెక్ట్‌ ఎంట్రీ పెటీ ఆఫీసర్‌, సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), మెట్రిక్‌ రిక్రూట్‌స్‌ (ఎంఆర్‌).

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. అంతర్జాతీయ/ జాతీయ/ రాష్ట్ర స్థాయి/ యూనివర్సిటీలో నిర్వహించే ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో పాల్గొని ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ ట్రయల్స్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 25.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/


ఎన్‌బీసీసీలో 70 పోస్టులు

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 70

పోస్టులు: డిప్యూట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సివిల్‌), ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (సివిల్‌) తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: గేట్‌ 2021 మెరిట్‌ ర్యాంకు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 08.

వెబ్‌సైట్‌: https://nbccindia.in/


ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, హైదరాబాద్‌లో....

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) దూరవిద్యా పద్ధతిలో 2022-23 విద్యాసంవత్సరానికి కింది పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) పీజీ డిప్లొమా ఇన్‌ సస్టైనబుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(పీజీడీఎస్‌ఆర్‌డీ)  

2) పీజీ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీటీడీఎం)  

3) పీజీ డిప్లొమా ఇన్‌ జియో స్పేషియల్‌ టెక్నాలజీ అప్లికేషన్స్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీజీడీజీఏఆర్‌డీ)  

4) డిప్లొమా ప్రోగ్రాం ఆన్‌ పంచాయతీ రాజ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (డీపీ-పీఆర్‌జీఆర్‌డీ)  

అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 15.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/


అప్రెంటిస్‌షిప్‌

ఐఓసీఎల్‌, సదరన్‌ రీజియన్‌ - 300 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), మార్కెటింగ్‌ డివిజన్‌ సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 300 ట్రేడులు: ఫిట్టర్‌, ఎల‌్రక్టీషియన్‌, ఎల‌్రక్టానిక్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, సివిల్‌, అకౌంటెంట్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30.11.2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 27.

వెబ్‌సైట్‌: https://iocl.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని