Updated : 20 Dec 2021 06:33 IST

నోటీస్‌ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీలో 90 మెడికల్‌ పోస్టులు

ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య, విధాన పరిషత్‌ వివిధ జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లోని ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్స్‌లో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 90   

పోస్టులు: రిసెర్చ్‌ సైంటిస్ట్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంటీఎస్‌.

ఖాళీలున్న ప్రాంతాలు: మదనపల్లె (చిత్తూరు)-15, ప్రొద్దుటూరు (కడప)-15, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)-30, నంద్యాల (కర్నూలు)-30.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,  ఇంటర్మీడియట్‌, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్‌, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 22, 27, 29.

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in


ఐఏఆర్‌ఐ - 641 టెక్నీషియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ కు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్లు (టీ-1)

మొత్తం ఖాళీలు: 641 అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 10.

వెబ్‌సైట్‌: https://www.iari.res.in


సైనిక్‌ స్కూల్‌, కోరుకొండలో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరుకొండ(విజయనగరం)లోని సైనిక్‌ స్కూల్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06

పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌-01, బ్యాండ్‌ మాస్టర్‌-01, హార్స్‌ రైడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌-01, వార్డ్‌బాయ్స్‌-03.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 09. చిరునామా: ప్రిన్సిపల్‌, సైనిక్‌ స్కూల్‌ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఏపీ-535214.

వెబ్‌సైట్‌: https://www./sainikschoolkorukonda.org


ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌-బొలారంలో...  

భారత ప్రభుత్వ రక్షణమంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌, బొలారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ. విభాగాలు: ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌సైన్స్‌, ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్‌(సీఎస్‌బీ) స్కోర్‌ కార్డ్‌.

ఎంపిక విధానం: సీబీఎస్‌ఈ/ఏడబ్ల్యూఈఎస్‌ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 17.

వెబ్‌సైట్‌: https://www.apsbolarum.edu.in


నీలిట్‌-న్యూదిల్లీలో సైంటిస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్ట్‌-బి:
మొత్తం ఖాళీలు: 16

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, డిసెంబరు 20.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 18.

వెబ్‌సైట్‌: https://www.nielit.gov.in/delhi


డిస్ట్రిక్ట్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్లు

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పని చేయడానికి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిస్ట్రిక్ట్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌

మొత్తం ఖాళీలు: 10

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 34 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 27.

వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in/home.do


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని