నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (ఎస్‌ఈఆర్‌) స్పోర్ట్స్‌ కోటా పరిధిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 03 Jan 2022 06:46 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే-కోల్‌కతా

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (ఎస్‌ఈఆర్‌) స్పోర్ట్స్‌ కోటా పరిధిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కోటా పోస్టులు మొత్తం ఖాళీలు: 21

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కబడ్డీ, స్విమ్మింగ్‌ తదితరాలు. అర్హత: ఇంటర్మీడియట్‌/ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ నైపుణ్యాలు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ కలిపి మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బంగ్లా నం: 12ఏ, గార్డెన్‌ రీచ్‌, కోల్‌కతా 700043. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 02, 2022
వెబ్‌సైట్‌:
https://ser.indianrailways.gov.in/


మిధాని-హైదరాబాద్‌లో 61 పోస్టులు

మినీరత్న కంపెనీ హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 61 పోస్టుల వారీగా ఖాళీలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ-53, అసిస్టెంట్‌ మేనేజర్‌-06, మేనేజర్‌-02 విభాగాలు: మెటలర్జీ, మెకానికల్‌, ఎల‌్రక్టికల్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, మెడికల్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. వయసు: 30-40 ఏళ్లు మించకూడదు. జీతభత్యాలు: పోస్టును అనుసరించి ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.40.70 లక్షలు చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2022.

వెబ్‌సైట్‌: https://midhani-india.in/


టిస్‌-ముంబయిలో టీచింగ్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ముంబయి, హైదరాబాద్‌, గువాహటి, తుల్జాపూర్‌లోని వివిధ స్కూల్స్‌/ క్యాంపస్‌ల్లో పనిచేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టీచింగ్‌ స్టాఫ్‌  మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత సాధించాలి.వయసు: 65 ఏళ్లు మించకూడదు. వేతనశ్రేణి: రూ.57,700 - రూ.2,18,200. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30, 2022.

వెబ్‌సైట్‌: https://tiss.edu/


ఎయిమ్స్‌-గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులుద కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 105 పోస్టులు వారీగా ఖాళీలు: ప్రొఫెసర్లు-28, అడిషనల్‌ ప్రొఫెసర్‌-22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-23, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-32 స్పెషలైజేషన్లు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. వయసు: పోస్టును అనుసరించి 58 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఎయిమ్స్‌, గోరఖ్‌పూర్‌, యూపీ. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2022.

వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/


ప్రవేశాలు
వెటర్నరీ యూనివర్సిటీలో

హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌)లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌టీవీయూ) 2021-2022 విద్యాసంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (ఎంవీఎస్సీ) అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 01.07.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఐకార్‌ - ఏఐఈఈఏ (పీజీ) - 2021 మెరిట్‌ ఆధారంగా.

2) పీహెచ్‌డీ ప్రవేశాలు అర్హత: వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. వయసు: 01.07.2021 నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఐకార్‌-ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ - 2021 మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.1500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 13, 2022.

వెబ్‌సైట్‌: https://tsvu.edu.in/home.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు