నోటీస్‌బోర్డు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ సివిల్‌ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Published : 07 Feb 2022 01:34 IST

ఉద్యోగాలు
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ సివిల్‌ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

*  సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, 2022

మొత్తం ఖాళీలు: 861

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 21 - 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.

ప్రిలిమ్స్‌ తేది: 2022, జూన్‌ 05.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 22.    

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఐఎఫ్‌ఎస్‌ ఎగ్జామ్‌

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది.

మొత్తం ఖాళీలు: 151

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ  దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 21 - 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.  

ప్రిలిమ్స్‌ పరీక్షతేది: 2022, జూన్‌ 05.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 22.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఎస్‌బీఐలో..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ మేనేజర్లు

మొత్తం ఖాళీలు: 48

విభాగాలు: నెట్‌వర్క్‌ సెక్యురిటీ స్పెషలిస్ట్‌, రూటింగ్‌ అండ్‌ స్విచింగ్‌.

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆన్‌లైన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 25.

పరీక్ష తేది: 2022, మార్చి 20.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/


500 జనరలిస్ట్‌ ఆఫీసర్లు

పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జనరలిస్ట్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 500

పోస్టులు-ఖాళీలు: జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌2 - 400, జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌ 3 - 100

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 22.

పరీక్ష తేది: 2022, మార్చి 12.

వెబ్‌సైట్‌: www.bankofmaharashtra.in/


ఎన్‌ఎండీసీలో 200 పోస్టులు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 200

పోస్టులు: ఫీల్డ్‌ అటెండెంట్‌ (ట్రెయినీ), మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌, బ్లాస్టర్‌, ఎల‌్రక్టీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 10.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 02.

వెబ్‌సైట్‌: www.nmdc.co.in/


బీహెచ్‌ఈఎల్‌లో 75 వెల్డర్‌ పోస్టులు

నాగ్‌పుర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌), పవర్‌ సెక్టర్‌-వెస్టర్న్‌ రీజియన్‌ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* వెల్డర్‌  

మొత్తం ఖాళీలు: 75

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్వాలిఫైడ్‌ బాయిలర్‌ వెల్డర్స్‌ సర్టిఫికెట్‌, అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.37,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐ మెరిట్‌ మార్కులు, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 14.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 2022, ఫిబ్రవరి 17.

వెబ్‌సైట్‌: www.bhel.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని