నోటీస్‌ బోర్డు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 14 Feb 2022 06:46 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ-33 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 33 పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్టోర్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనమిస్టులు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్‌/ స్లెట్‌/ సెట్‌ అర్హత, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరితేది: 2022, మార్చి 03.

వెబ్‌సైట్‌: ‌ www.upsc.gov.in/


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో..

ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్‌ మేనేజర్లు (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)
మొత్తం ఖాళీలు: 19 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్‌ నాలెడ్జ్‌, పని అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్ష తేది: 2022, మార్చి 27. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 02.

వెబ్‌సైట్‌:www.centralbankofindia.co.in/en


జీజీహెచ్‌, గుంటూరులో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 87 పోస్టులు: ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఆప్టోమెట్రిస్టులు, స్పీచ్‌ థెరపిస్టులు తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 15. చిరునామా: సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్‌), గుంటూరు, ఏపీ.

వెబ్‌సైట్‌:  https://guntur.ap.gov.in/
 


ప్రవేశాలు

ఎన్‌టీఏ-ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022 సంవత్సరానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2022-2023 సంవత్సరానికి దేశవ్యాప్తంగా బీఎస్సీ(హాస్పిటాలిటీ, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2022

అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా. పరీక్ష తేది: 2022, మే 28. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 03.

వెబ్‌సైట్‌:  https://nchmjee.nta.nic.in/


ఇస్రో - ఐఐఆర్‌ఎస్‌లో...

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)కి చెందిన దెహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌) కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అందిస్తున్న కోర్సులు:
1) ఎంటెక్‌ - రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌
2) పీజీ డిప్లొమా - రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌
3) ఎమ్మెస్సీ - జియో ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఎర్త్‌ అబ్వర్వేషన్‌ 4) పీజీ డిప్లొమా - జియో ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఎర్త్‌ అబ్వర్వేషన్‌
5) సర్టిఫికెట్‌ కోర్సు - రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌ టెక్నాలజీ అండ్‌ అప్లికేషన్స్‌ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరితేది: 2022, మార్చి 31, సర్టిఫికెట్‌ కోర్సుకు 2022, మార్చి 11.

వెబ్‌సైట్‌:  https://admission.iirs.gov.in/


అప్రెంటీస్‌షిప్‌

డీఈఆర్‌ఎల్‌-హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఈఆర్‌ఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 37 ట్రేడులు: లక్ట్రానిక్‌ మెకానిక్‌, ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైనవాళ్లే అర్హులు. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరితేది: 2022, ఫిబ్రవరి 21. 

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని