నోటీస్‌బోర్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(టీఎస్‌సీఏబీ) ఆధ్వర్యంలోని వివిధ జిల్లాలకు చెందిన కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకులు(డీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

Updated : 21 Feb 2022 06:48 IST

ఉద్యోగాలు

తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో 445  పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(టీఎస్‌సీఏబీ) ఆధ్వర్యంలోని వివిధ జిల్లాలకు చెందిన కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకులు(డీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
మొత్తం ఖాళీలు: 445 (స్టాఫ్‌ అసిస్టెంట్లు-372, అసిస్టెంట్‌ మేనేజర్లు-73) జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్‌-69, హైదరాబాద్‌-52, కరీంనగర్‌-84, మహబూబ్‌నగర్‌-32, మెదక్‌-72, నల్గొండ-36, వరంగల్‌-50, ఖమ్మం-50. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 06. ప్రిలిమినరీ పరీక్ష తేది: 2022, ఏప్రిల్‌ 24.

వెబ్‌సైట్‌: https://tscab.org/


నిట్‌-వరంగల్‌లో....

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 99 పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-29, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-50, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1: 12, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2: 08 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 21. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 17.

వెబ్‌సైట్‌: https://nitw.ac.in/


65 అసిస్టెంట్‌ కమాండెంట్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 01/ 2023 బ్యాచ్‌ కోసం వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌)
మొత్తం ఖాళీలు: 65 విభాగాలు: జనరల్‌ డ్యూట్‌, కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ, టెక్నికల్‌. అర్హత: విభాగాల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ప్రిలిమినరీ టెస్ట్‌, ఫైనల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 28.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/


వాక్‌-ఇన్స్‌
ఇర్కాన్‌లో 389 ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 389 పోస్టులు: సీనియర్‌ వర్క్స్‌ ఇంజినీర్లు, వర్క్స్‌ ఇంజినీర్లు, సైట్‌ సూపర్‌వైజర్లు, జియాలజిస్ట్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేదీలు: 2022, మార్చి 08, 11, 12 వేదిక: సంబంధిత రాష్ట్రాల ఇర్కాన్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: www.ircon.org/


ప్రవేశాలు
నెస్ట్‌-2022

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భువనేశ్వర్‌లోని నైసర్‌, ముంబయిలోని యూఎం-డీఏఈ సీఈబీఎస్‌ సంయుక్తంగా 2022 సంవత్సరానికి నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌-2022) నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. దీని ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: సైన్స్‌ విభాగాల్లో 2020/ 2021లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు అర్హులు. 2022లో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 21. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 18. నెస్ట్‌ 2022 పరీక్ష తేది: 2022, జూన్‌ 18. 

వెబ్‌సైట్‌: https://nestexam.in/


ఎన్‌టీఏ-సీమ్యాట్‌ 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌) 2022 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 17.

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని