సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) 1149 కానిస్టేబుల్‌/ ఫైర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.ఎంపిక విధానం:

Updated : 23 Feb 2022 07:16 IST

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) 1149 కానిస్టేబుల్‌/ ఫైర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), రాత పరీక్ష ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఉంటాయి. వీటిల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష ఓఎంఆర్‌ విధానంలో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ, ఆయా రాష్ట్రాలవారీగా ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షల వివిధ దశల్లో అడ్మిట్‌ కార్డును ఆన్‌లైన్‌ ద్వారానే జారీచేస్తారు. పోస్టు ద్వారా పంపించరు. కాబట్టి అభ్యర్థులు వెబ్‌సైట్‌ను తరచూ చూస్తుండాలి. అడ్మిట్‌ కార్డును వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు: మొత్తం 1149 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 79, తెలంగాణకు 30 కేటాయించారు. మొత్తం పోస్టుల్లో 10 శాతాన్ని మాజీ సైనికోద్యోగులకు రిజర్వ్‌ చేశారు. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించవచ్చు. అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ. చెస్ట్‌ 80-85 సెం.మీ. ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఎత్తు విషయంలో మినహాయింపులు ఉంటాయి.

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

వయఃపరిమితి: 18-23 సంవత్సరాలు ఉండాలి. 05.03.99 కంటే ముందు 04.03.2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు వయఃపరిమితిలో రిజర్వేషన్లు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము: రూ.100. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: 04.03.2022

వెబ్‌సైట్‌: ‌www.cisfrectt.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని