నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ 2023 జనవరి (ఎస్‌టీ 23) కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 24 Feb 2022 05:46 IST

ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీ - 155 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ 2023 జనవరి (ఎస్‌టీ 23) కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 155 బ్రాంచిల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌-93, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌)-17, టెక్నికల్‌ బ్రాంచ్‌-45.

విభాగాలు: జనరల్‌ సర్వీస్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, పైలట్‌, ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 25.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 12. వెబ్‌సైట్‌:www.joinindiannavy.gov.in/


ఎన్‌టీపీసీలో 97 మెడికల్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) కింది మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 97 పోస్టులు-ఖాళీలు: జీడీఎం-60, మెడికల్‌ స్పెషలిస్టులు-37

విభాగాలు: పీడియాట్రీషియన్లు, ఆర్థోపెడిక్స్‌, రేడియాలజిస్ట్‌, పాథాలజిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ)/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 25.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 16. వెబ్‌సైట్‌:www.ntpc.co.in/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో...

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద/ రెగ్యులర్‌ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42

పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ మేనేజర్లు-27, మేనేజర్లు-04, హెడ్‌/ డిప్యూటీ హెడ్‌-11.

విభాగాలు: రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 15.

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/


బెల్‌లో ప్రాజెక్ట్‌, ట్రెయినీ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20 పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-12, ట్రెయినీ ఇంజినీర్లు-08.

విభాగాలు: ఎల‌్రక్టానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, ఎల‌్రక్టికల్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 16.

వెబ్‌సైట్‌:www.bel-india.in/


ఎన్‌ఎండీసీలో 168 అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 168  అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌-130, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-27, డిప్లొమా అప్రెంటిస్‌లు-11. ట్రేడులు/

విభాగాలు: మెషినిస్ట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మార్చి 10-25. వేదిక: బైలా క్లబ్‌, బీఐఓఎం కిరండాల్‌ కాంప్లెక్స్‌, దంతెవాడ, చత్తీస్‌గఢ్‌-494556.

వెబ్‌సైట్‌:www.nmdc.co.in/


డీఆర్‌డీఓ-జీటీఆర్‌ఈలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్‌డీఓ-గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జీటీఆర్‌ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 150  అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు-75, డిప్లొమా అప్రెంటిస్‌ ట్రెయినీలు-20, ఐటీఐ అప్రెంటిస్‌ ట్రెయినీలు-25, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు (జనరల్‌ స్ట్రీమ్‌)-30

విభాగాలు: మెకానికల్‌, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టికల్స్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌, సివిల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, మార్చి 14.

వెబ్‌సైట్‌: https://rac.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని