నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 01 Mar 2022 01:42 IST

ఉద్యోగాలు
ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 21 పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసొసియేట్లు అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 13.

వెబ్‌సైట్‌:www.ngri.res.in/


ఎన్‌హెచ్‌ఏఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి చెందిన విజయవాడ ప్రాంతీయ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* యంగ్‌ ప్రొఫెషనల్స్‌ (టెక్నాలజీ)
మొత్తం ఖాళీలు: 11 అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ 2021 స్కోర్‌, సంబంధిత అనుభవం. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: గేట్‌ 2021 మెరిట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 25

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/


ప్రవేశాలు

ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఐటీడీ-ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం 2022 విద్యాసంవత్సరానికి కింది డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
అందిస్తున్న ప్రోగ్రాములు: టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. వయసు: 15 - 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 01. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 08. ప్రవేశ పరీక్ష తేది: 2022, మే 15. వెబ్‌సైట్‌:
https://nhai.gov.in/


వాక్‌ఇన్‌

కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్‌లో..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన మహబూబాబాద్‌ (తెలంగాణ)లోని కేంద్రీయ విద్యాలయ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు: పీఆర్‌టీలు, టీజీటీలు, స్పోర్ట్స్‌ కోచ్‌, యోగా టీచర్లు, పీఆర్‌టీ మ్యూజిక్‌ టీచర్‌ తదితరాలు. అర్హత: ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, సీటెట్‌ స్కోరు ఉండాలి. ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 8, 9. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 2022, మార్చి 04. 

 వెబ్‌సైట్‌: https://mahabubabad.kvs.ac.in/


అప్రెంటిస్‌షిప్‌

బెల్‌, మచిలీపట్నంలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మచిలీపట్నం (ఏపీ)లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు 2) డిప్లొమా అప్రెంటిస్‌లు
సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 02.

వెబ్‌సైట్‌: www.bel-india.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని