నోటీసు బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 03 Mar 2022 05:13 IST

ఉద్యోగాలు

ఎన్‌టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 60 విభాగాల వారీగా ఖాళీలు: ఫైనాన్స్‌ (సీఏ/ సీఎంఏ)-20, ఫైనాన్స్‌ (ఎంబీఏ)-10, హెచ్‌ఆర్‌-30. వయసు: 29 ఏళ్లు మించకుండా ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 07. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 21. వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/


ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో...

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 40 అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, టైపింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. వెబ్‌సైట్‌: ‌www.iitkgp.ac.in/


హెచ్‌ఎస్‌ఎల్‌, విశాఖపట్నంలో....

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 40 పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ తదితరాలు. విభాగాలు: హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టెక్నికల్‌, కమర్షియల్‌, సివిల్‌, అడ్మినిస్ట్రేషన్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 30 - ఏప్రిల్‌ 20 వరకు. దరఖాస్తు హార్‌ ్డకాపీల స్వీకరణకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 05 -  ఏప్రిల్‌ 25 వరకు.
వెబ్‌సైట్‌:www.hslvizag.in/

 


స్కాలర్‌షిప్‌

ఎల్‌ఖీటీ బిల్డ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌ 2022

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఎల్‌ఖీటీ కన్‌స్ట్రక్షన్‌ 2022 సంవత్సరానికి కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ చదువుతున్న విద్యార్థుల కోసం ఎల్‌ఖీటీ బిల్డ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.
అర్హత: 2022 విద్యాసంవత్సరంలో కోర్‌ సివిల్‌/ కోర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష (సబ్జెక్ట్‌ ఖీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా. స్కాలర్‌షిప్‌: ఈ కోర్సు(ఎంటెక్‌) 24 నెలలు ఉంటుంది. నెలకు రూ.13,400 చొప్పున చెల్లిస్తారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎల్‌ఖీటీ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2022, మార్చి 31. వెబ్‌సైట్‌: www.lntecc.com/


వాక్ ఇన్‌

ఎయిమ్స్‌, మంగళగిరిలో..

మంగళగిరి (ఆంధ్రప్రదేశ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు
మొత్తం ఖాళీలు: 09 విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్‌ సర్జరీ, పార్మకాలజీ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. వాక్‌ఇన్‌ తేది: 2022, మార్చి 31. వేదిక: ధర్మశాల బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, ఏపీ. వెబ్‌సైట్‌:www.aiimsmangalagiri.edu.in/


కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.
మా చిరునామా: చదువు, ఈనాడు కార్యాలయం, అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512 edc@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని