నోటీస్‌బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టులు జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసెస్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

Updated : 07 Mar 2022 05:38 IST

ఉద్యోగాలు
తెలంగాణ కోర్టుల్లో 591 ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టులు జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసెస్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

మొత్తం ఖాళీలు: 591

పోస్టులు: స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.

వయసు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఓరల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 105 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 105,

విభాగాలు: ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌ఎంఈ విభాగం, కార్పొరేట్‌ క్రెడిట్‌ విభాగం.

పోస్టులు: మేనేజర్‌ (డిజిటల్‌ ఫ్రాడ్‌), క్రెడిట్‌ ఆఫీసర్లు, ఫోరెక్స్‌ (అక్విజిషన్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌)

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకియాట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 24. వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/

 


ప్రవేశాలు

టీఎస్‌ఆర్‌జేసీ-సెట్‌ 2022

హైదరాబాద్‌లోని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.

అందిస్తున్న కోర్సులు: ఇంగ్లిష్‌ మీడియం - ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.

అర్హత: మే-2022లో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 07.

చివరితేది: 2022, ఏప్రిల్‌ 11. https://tsrjdc.cgg.gov.in/


సైనిక్‌ స్కూల్‌లో...

కరీంనగర్‌జిల్లా, రుక్మాపూర్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌ ఆరో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 2021-2022 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణులైన బాలురు అర్హులు.

వయసు: 01.04.2022 నాటికి ఆరో తరగతి బాలురు 11 ఏళ్లు, ఇంటర్‌ విద్యార్థులు 16 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్టులు (ఫిజికల్‌/ పర్సనాలిటీ/ ఇంటర్వ్యూ/ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022 మార్చి 21.

పరీక్ష తేది: 2022, మార్చి 27.

వెబ్‌సైట్‌:  www.tswreis.ac.in/


ఆర్‌జేసీ & ఆర్‌డీసీ సెట్‌

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌ 2022 ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్‌ గ్రూపులు (ఇంగ్లిష్‌ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు.

డిగ్రీ కోర్సులు: 1) బీఎస్సీ, ఎంపీసీ, 2) బీఎస్సీ, ఎంఎస్‌సీఎస్‌ 3) బీఎస్సీ ఎంపీసీఎస్‌ తదితరాలు.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 08.

చివరి తేది: 2022, మే 22.

ప్రవేశ పరీక్ష తేది: 2022, జూన్‌ 05. http://mjptbcwreis.cgg.gov.in/


అప్రెంటిస్‌లు

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో....

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 206 ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌లు-173, డిప్లొమా అప్రెంటిస్‌లు-33

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ, మెటలర్జీ తదితరాలు.

అర్హత: ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 10.

వెబ్‌సైట్‌: www.vizagsteel.com/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని