నోటీసు బోర్డు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ(ఓటీఏ) 2022( అక్టోబరు) సంవత్సరానికి గాను అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్‌ పర్సనల్‌ విడోస్‌ నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 09 Mar 2022 00:13 IST

ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీ-191 ఖాళీలు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ(ఓటీఏ) 2022( అక్టోబరు) సంవత్సరానికి గాను అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్‌ పర్సనల్‌ విడోస్‌ నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) మెన్‌/ ఉమెన్‌ (అక్టోబరు 2022) కోర్సు
మొత్తం ఖాళీలు: 191 విభాగాల-ఖాళీలు: ఎస్‌ఎస్‌సీ (టెక్‌) మెన్‌-175, ఎస్‌ఎస్‌సీ (టెక్‌) ఉమెన్‌-14, విడోస్‌ డిఫెన్స్‌ పర్సనల్‌-02. అర్హత: విభాగాల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 06. వెబ్‌సైట్‌ http://joinindianarmy.nic.in/


హెచ్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 25 పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు-05, అసిస్టెంట్‌ మేనేజర్లు-08, సీనియర్‌ ఆఫీసర్లు-12. విభాగాలు: ఇంజిన్‌, కొర్రోసియన్‌ రిసెర్చ్‌, క్రూడ్‌ అండ్‌ ఫ్యూయల్స్‌ రిసెర్చ్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 14. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18.
వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com/


ఐఐటీ బాంబేలో...

ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10 పోస్టులు-ఖాళీలు: టెక్నికల్‌ ఆఫీసర్లు-02, జూనియర్‌ మెకానిక్‌-08. అర్హత: సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/ స్కిల్‌ టెస్ట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 06. వెబ్‌సైట్‌:www.iitb.ac.in/


ప్రవేశాలు

ఏపీ గురుకుల విద్యాలయాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తాడేపల్లి (అమరావతి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) 2022-2023  విద్యాసంవత్సరానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఐదో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాలు
అర్హత: ఐదో తరగతి ప్రవేశాలకు నాలుగో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31. ప్రవేశ పరీక్ష తేది: 2022, ఏప్రిల్‌ 24. వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in/


ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో...

ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 2022 విద్యాసంవత్సరానికి ఐఐఎం అహ్మాదాబాద్‌ మెంటార్‌షిప్‌ ఆధ్వర్యంలో కింది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
1) పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా మేనేజ్‌మెంట్‌ (ఎనర్జీ మేనేజ్‌మెంట్‌)
2) పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా మేనేజ్‌మెంట్‌ (ఎగ్జిక్యూటివ్‌)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌ ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ అసెస్‌మెంట్‌, క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌, అకడమిక్‌ రికార్డ్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.
వెబ్‌సైట్‌: https://nsb.ac.in/



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని