నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 10 Mar 2022 01:26 IST

ఉద్యోగాలు
బెల్‌లో 38 ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 38 పోస్టులు-ఖాళీలు: ట్రెయినీ ఇంజినీర్లు-13, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-25. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: బీఈ/ బీటెక్‌ మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 23.

 వెబ్‌సైట్‌: ‌www.bel-india.in/


ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 29 విభాగాల వారీగా ఖాళీలు: ఎల‌్రక్టికల్‌-06, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌-09, మెకానికల్‌-10, మైనింగ్‌-04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌-2021 వాలిడ్‌ స్కోర్‌. వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: గేట్‌-2021 మెరిట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 23. 

వెబ్‌సైట్‌: www.nmdc.co.in/


ఏపీవీవీపీ - 49 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు
మొత్తం ఖాళీలు: 49 అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌. ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 15.  

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


ఐఓసీఎల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్లు 

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*అసిస్టెంట్‌ ఆఫీసర్లు (ఫైనాన్స్‌)
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 30. వెబ్‌సైట్‌:
https://iocl.com/


ప్రవేశాలు

టీజీసెట్‌-2022

కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.
* గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలు
అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువున్న విద్యార్థులు అర్హులు. ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 28. ప్రవేశ పరీక్ష తేది: 2022, మే 08.

వెబ్‌సైట్‌: https://tgcet.cgg.gov.in/


కెరియర్‌, ఉన్నతవిద్యలకుసంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి.నిపుణులు సమాధానాలు ఇస్తారు.

మా చిరునామా:
చదువు,ఈనాడు కార్యాలయం,
అనాజ్‌పూర్‌,అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం,
రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512

edc@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని