నోటీస్‌ బోర్డు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఇండియా) లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 16 Mar 2022 06:37 IST

ఉద్యోగాలు

ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఇండియా) లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 81

పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్లు-80, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-01.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 14.

వెబ్‌సైట్‌ : www.nbccindia.com


ఎయిమ్స్‌, మంగళగిరిలో...

మంగళగిరి (ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌

మొత్తం ఖాళీలు: 17 అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: ‌www.aiimsmangalagiri.edu.in


ఏఐఏఎస్‌ఎల్‌లో 255 పోస్టులు

న్యూదిల్లీలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 255

పోస్టులు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్‌ ఏజెంట్లు, ర్యాంప్‌ సర్వీస్‌ ఏజెంట్లు, హ్యాండీమెన్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్‌ నైపుణ్యాలు.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 21.

వెబ్‌సైట్‌:www.aiasl.in


ప్రవేశాలు

బిట్‌శాట్‌-2022

పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) 2022-2023 విద్యా సంవత్సరానికి బిట్‌శాట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా బిట్స్‌ పిలానీ క్యాంపస్‌, కేకే బిర్లా గోవా క్యాంపస్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌) 2022

అందిస్తున్న కోర్సులు: బీఈ, బీఫార్మా, ఎమ్మెస్సీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌-2022) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 21.

పరీక్ష తేదీలు: 2022 జూన్‌ 20 నుంచి 26 వరకు.

వెబ్‌సైట్‌: ‌www.bitsadmission.com


ఎన్‌టీఏ - నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ(ఎన్‌ఈటీఎస్‌) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ అనుబంధ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ (ఎన్‌ఈటీఎస్‌) 2022

అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతున్న షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ) చెందిన విద్యార్థులు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌ (ఆఫ్‌లైన్‌) ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 14. పరీక్ష తేది: 2022, మే 7.

వెబ్‌సైట్‌: https://shreshta.nta.nic.in


ఎన్‌బీఈ-ఎఫ్‌ఎంజీఈ జూన్‌ 2022

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ) మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు నిర్వహించే జూన్‌ 2022 సెషన్‌ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) కోసం దరఖాస్తులు కోరుతోంది.

ఎఫ్‌ఎంజీఈ ఉద్దేశం: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన మెడికల్‌ గ్రాడ్యుయేట్లు భారతదేశంలో మెడికల్‌ ప్రాక్టీస్‌ చేయడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఎన్‌బీఈ ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు (జూన్‌, డిసెంబరు) నిర్వహిస్తోంది.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

పరీక్ష తేది: 2022, జూన్‌ 04.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: https://nbe.edu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని