నోటీస్‌బోర్డు

ఇండియన్‌ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 17 Mar 2022 02:47 IST

ఉద్యోగాలు
ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

ఇండియన్‌ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్లు మొత్తం ఖాళీలు: 2500 (ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ)-500, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)-2000)

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 29.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 05.

వెబ్‌సైట్‌:www.joinindiannavy.gov.in/


సీ-డ్యాక్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ మేనేజర్లు-02, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-08, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-41, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-03.

విభాగాలు: సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎంబడెడ్‌ సిస్టమ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 30.

వెబ్‌సైట్‌: www.cdac.in/


ఎన్‌హెచ్‌ఎం, తెలంగాణలో...

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) తెలంగాణలోని జిల్లా ప్రధానకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 92

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్‌ నర్సులు-34, ల్యాబ్‌ టెక్నీషియన్లు-32, ఫార్మసిస్టులు-26.

అర్హత: పోస్టుల్ని అనుసరించి జీఎన్‌ఎం/ బీఎస్సీ (నర్సింగ్‌), ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ, బీఫార్మసీ/ డీఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. ఈమెయిల్‌: recruitments.nhm@gmail.com

చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://tsnhm.cgg.gov.in/


బీఈఎంఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు (గ్రేడ్‌-2)

అర్హత: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈఈఈ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 30.

వెబ్‌సైట్‌: www.bemlindia.in/


ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ట్రాన్స్‌లేటర్లు

న్యూదిల్లీలోని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రాన్స్‌లేటర్లు

మొత్తం ఖాళీలు: 43

భాషల వారీగా ఖాళీలు: గుజరాతీ-03, కన్నడ-02, తమిళ్‌-07, తెలుగు-05, మరాఠీ-02, బెంగాలీ-12, ఒరియా-10, ఉర్దూ/ కాశ్మీరీ-01, అస్సామీస్‌-01.

అర్హత: గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: https://nhrc.nic.in/


అప్రెంటిస్‌షిప్‌

రైల్‌టెల్‌ కార్పొరేషన్‌లో 103 ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్లు/ డిప్లొమా ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 103

విభాగాలు: ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: ‌www.railtelindia.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని