నోటీస్‌బోర్డు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Mar 2022 00:38 IST

ఉద్యోగాలు

ఆర్‌బీఐలో 303 పోస్టులు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 303

పోస్టులు-ఖాళీలు: గ్రేడ్‌ బి ఆఫీసర్లు-294, అసిస్టెంట్‌ మేనేజర్లు-09.

విభాగాలు: జనరల్‌, ఎకనమిక్‌ అండ్‌ పాలిసీ రిసెర్చ్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, రాజ్‌భాష, ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌/ రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 28

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18.

వెబ్‌సైట్‌: www.rbi.org.in/


ఈసీజీసీలో 75 పీఓ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీజీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)

మొత్తం ఖాళీలు: 75

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ (ప్రిలిమినరీ, డిస్క్రిప్టివ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 20.

పరీక్ష తేది: 2022, మే 29.

వెబ్‌సైట్‌: www.ecgc.in/


గోవా షిప్‌యార్డ్‌లో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాస్కోడగామా (గోవా)లోని గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 253

పోస్టులు: అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, వెల్డర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్ట్రక్చురల్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 29.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 28.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, మే 09.

వెబ్‌సైట్‌: https://goashipyard.in/


బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), ఘజియాబాద్‌ యూనిట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 63

పోస్టులు-ఖాళీలు: ట్రెయినీ ఇంజినీర్లు-26, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-37.

విభాగాలు: ఈసీఈ, మెకానికల్‌, సీఎస్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 06.

వెబ్‌సైట్‌: www.bel-india.in/


పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌), నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా ట్రెయినీలు (ఎలక్ట్రికల్‌, సివిల్‌)

మొత్తం ఖాళీలు: 16

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 20.

వెబ్‌సైట్‌: www.powergrid.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని