నోటీస్‌ బోర్డు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 28 Mar 2022 06:46 IST

ఉద్యోగాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 159 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* బ్రాంచి రిసీవబుల్‌ మేనేజర్లు  మొత్తం ఖాళీలు: 159 అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 14. వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/


కేఎంసీ/ఎంజీఎం హాస్పిటల్‌, వరంగల్‌లో....

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హన్మకొండలోని కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)/ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ హాస్పిటల్‌ (ఎంజీఎం) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 135 పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 115,  సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-20. విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, ఏప్రిల్‌ 11. చిరునామా: ది సూపరింటెండెంట్‌, ఎంజీఎం హాస్పిటల్‌, ఎంజీ రోడ్‌, వరంగల్‌ - 506007. వెబ్‌సైట్‌: https://kmcwgl.com/


యూపీఎస్సీ-28 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 28  పోస్టులు: డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు. విభాగాలు: మైన్స్‌ సేఫ్టీ, ఎకనమిక్‌ ఇన్వెస్టిగేషన్‌, ఆప్తమాలజీ, సివిల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌/ ఎండీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, ఏప్రిల్‌ 14. వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


తెలంగాణ - టెట్‌ 2022

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విభాగం టెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2022
అర్హత: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ)/ డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్‌ పండిట్‌/ తత్సమాన అర్హతలు ఉన్న అభ్యర్థులతో పాటు చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్‌ 1, పేపర్‌ 2) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 12. టెట్‌ 2022 పరీక్ష తేది: 2022, జూన్‌ 12.
https://tstet.cgg.gov.in/


ప్రవేశాలు

ఎన్‌ఎస్‌ఐ, కాన్పూర్‌లో...

కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌ఐ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

పీజీ డిప్లొమా: ఏఎన్‌ఎస్‌ఐ-షుగర్‌ టెక్నాలజీ, ఏఎన్‌ఎస్‌ఐ-షుగర్‌ ఇంజినీరింగ్‌, డీఐఎఫ్‌ఏటీ తదితరాలు. సర్టిఫికెట్‌ కోర్సులు: షుగర్‌ బాయిలింగ్‌, షుగర్‌ ఇంజినీరింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌. డిప్లొమా కోర్సులు: ఫర్మంటేషన్‌ టెక్నాలజీ, షుగర్‌ ఇంజినీరింగ్‌, షుగర్‌ టెక్నాలజీ/ కెమిస్ట్రీ. అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.  ఎంపిక విధానం: అడ్మిషన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 11. చివరి తేది: 2022, మే 27. పరీక్ష తేది: 2022, జూన్‌ 26. వెబ్‌సైట్‌: http://nsi.gov.in/



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని