నోటీస్ బోర్డు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) టీఎస్‌ ఎంసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహిస్తోంది.

Published : 29 Mar 2022 00:46 IST

ప్రవేశాలు

టీఎస్‌ ఎంసెట్‌-2022

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) టీఎస్‌ ఎంసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహిస్తోంది.

* తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఎంసెట్‌-2022)

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు

విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 06.

చివరి తేది: 2022, మే 28. (ఆలస్య రుసుం లేకుండా).

అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌ పరీక్ష తేదీలు: 2022, జులై 14, 15.

ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: 2022, జులై 18, 19, 20.

వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/


ఎన్‌టీఏ - సీయూఈటీ (యూజీ) 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 02.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: https://nta.ac.in/


టీఎస్‌ ఈసెట్‌-2022

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) టీఎస్‌ ఈసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అభ్యర్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు.

* తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఈసెట్‌) 2022

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 06.

చివరి తేది: 2022, జూన్‌ 08.

పరీక్ష తేది: 2022, జులై 13.

వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in/


వాక్‌-ఇన్స్‌

డీఎంహెచ్‌ఓ, కడపలో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* స్పెషలిస్ట్‌ డాక్టర్లు

మొత్తం ఖాళీలు: 52

విభాగాలు: జీరియాట్రిక్‌, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, స్కిన్‌, ఆర్థోపెడిక్స్‌, చెస్ట్‌ తదితరాలు.

అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేది: 2022 మార్చి 26 నుంచి 31 వరకు.

వేదిక: డీఎంహెచ్‌ఓ, వైఎస్సార్‌ కడప జిల్లా, ఏపీ.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/


ఉద్యోగాలు

ఎన్‌ఎల్‌సీ లిమిటెడ్‌లో 300 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 300

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మైనింగ్‌, జియాలజీ, కెమికల్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, ఏప్రిల్‌ 11.

వెబ్‌సైట్‌: www.nlcindia.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని