నోటీస్‌బోర్డు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Mar 2022 02:13 IST

ఉద్యోగాలు

బెల్‌లో 33 పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 33

పోస్టులు- ఖాళీలు: డిప్యూటీ మేనేజర్లు-06, సీనియర్‌ ఇంజినీర్లు-27 విభాగాలు: కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆప్టిక్స్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18.

చిరునామా: మేనేజర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), జలహళ్లి, బెంగళూరు - 560013.

వెబ్‌సైట్‌: www.bel-india.in


ప్రవేశాలు

ఐఎంయూ సెట్‌ 2022

ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* ఐఎంయూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2022

1) అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ): బీటెక్‌ (మెరైన్‌ ఇంజినీరింగ్‌), బీఎస్సీ (నాటికల్‌ సైన్స్‌) తదితరాలు.

2) పీజీ ప్రోగ్రాములు: ఎంబీఏ (పోర్ట్‌, షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌), ఎంటెక్‌ (డ్రెడ్జింగ్‌, హార్బర్‌ ఇంజినీరింగ్‌) తదితరాలు.

3) పీజీ డిప్లొమా: మెరైన్‌ ఇంజినీరింగ్‌ 4) పీహెచ్‌డీ అండ్‌ ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రాములు

అర్హత: ప్రోగ్రాములననుసరించి ఇంటర్మీడియట్‌, బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 2022, మే 16. వెబ్‌సైట్‌: www.imu.edu.in/


వాక్‌-ఇన్స్‌

ఇస్రో-ఐఐఆర్‌ఎస్‌లో...

ఇస్రోకు చెందిన దెహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 20

పోస్టులు - ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)-16, రిసెర్చ్‌ అసోసియేట్‌-03, రిసెర్చ్‌ సైంటిస్ట్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 28 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, ఏప్రిల్‌ 18-22.

వేదిక: ఐఐఆర్‌ఎస్‌ సెక్యూరిటీ రిసెప్షన్‌, ఐఐఆర్‌ఎస్‌, కాళిదాస్‌ రోడ్‌, దెహ్రాదూన్‌-248001.

వెబ్‌సైట్‌: www.iirs.gov.in/


నార్మ్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) ఒప్పంద పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తుంది..

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 12

విభాగాలు: ఎక్స్‌ఎస్‌ఎం డివిజన్‌, డీటీఎంఏ, ఆడిట్‌ & అకౌంట్స్‌ సెక్షన్‌, ఈఎస్‌ఎం డివిజన్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌, బీకామ్‌/బీబీఏ/బీబీఎస్‌, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, ఏప్రిల్‌ 18, 20, 22. వేదిక: ఐకార్‌-నార్మ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-30, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://naarm.org.in/home/


ఫెలోషిప్‌

కర్ణాటక సురత్కల్‌లోని నిట్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం జూనియర్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హత: ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులు. గేట్‌ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: (వరుసగా) 32, 35 ఏళ్లు.

జీతం: 25,000/-, 28,000/-

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 18.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.


అప్రెంటిస్‌షిప్‌

ఇస్రో-వీఎస్‌ఎస్‌సీలో...

తిరువనంతపురంలోని ఇస్రో- విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 297

ట్రేడులు: ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రోప్లేటర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.

అర్హత: ట్రేడుల్లో ఐటీఐ, బీఎస్సీ (ఎంపీసీ) ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 04.

www.vssc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని