నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 07 Apr 2022 00:31 IST

ఉద్యోగాలు
ఏపీలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు

మొత్తం ఖాళీలు: 4775 జోన్ల వారీగా ఖాళీలు: విశాఖపట్నం-974, రాజమండ్రి-1446, గుంటూరు-967, కడప-1368.

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌తో పాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 07.

దరఖాస్తులకు చివరితేది: 2022, ఏప్రిల్‌ 16

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/


బెల్‌లో 91 పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 91

పోస్టులు - ఖాళీలు: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీలు (ఈఏటీ)-66, టెక్నీషియన్‌ సీ-25

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, మిల్లర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 20.

వెబ్‌సైట్‌: www.bel-india.in/


బీఈసీఐఎల్‌ - 378 పోస్టులు

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పందపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 378

పోస్టులు-ఖాళీలు: ఆఫీస్‌ అసిస్టెంట్లు-200, డేటా ఎంట్రీ ఆపరేటర్లు-178.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ డిస్కషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 25.

వెబ్‌సైట్‌: ‌ www.becil.com/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో...
 

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 79

పోస్టులు-ఖాళీలు: అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు-26, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-53.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ పీజీ డిగ్రీ/ డిప్లొమా/ సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 25 - 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 26.
వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/


ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, సేఫ్టీ, లా, ఫైనాన్స్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, సివిల్‌ తదితరాలు.

అర్హత: విభాగాల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, లా డిగ్రీ, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 25.

వెబ్‌సైట్‌: ‌ www.nmdc.co.in/


ప్రవేశాలు

నైసర్‌, భువనేశ్వర్‌లో...

భువనేశ్వర్‌లోని నైసర్‌కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌ 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రాం  
- స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌

అర్హత: ఫిజికల్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: జామ్‌/ జస్ట్‌ 2022 స్కోర్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

టెస్ట్‌/ ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్‌ 02, 03.

వెబ్‌సైట్‌: ‌ www.niser.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు