ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జనవరి-2022 విద్యాసంవత్సరానికిగానూ బీ.ఈడీలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

Published : 11 Apr 2022 01:44 IST

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జనవరి-2022 విద్యాసంవత్సరానికిగానూ బీ.ఈడీలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

* కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) థియరీ, ప్రాక్టికల్‌ సమ్మేళనంగా ఉంటుంది. 

* కాలవ్యవధి: రెండేళ్లు(కనీసం) - ఐదేళ్లు(గరిష్ఠం) 

* అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి 50 శాతం మార్కులతో యూజీ లేదా పీజీతో పాటు బోధనలో అనుభవం ఉండాలి.  

* ఎంపిక: ప్రవేశపరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* మీడియం: ఇంగ్లిష్, హిందీ.

* ఫీజు: రూ.50,000 (పూర్తికాలానికి)

* ప్రవేశ పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. - సిలబస్‌: జనరల్‌ ఇంగ్ల్లిష్, కాంప్రహెన్షన్, లాజికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. - పరీక్ష సమయం: 1 గంట, రుణాత్మక మార్కులు లేవు. - ప్రవేశ పరీక్ష ఫీజు: రూ.1000/-

* కోర్సు: పోస్ట్‌ బేసిక్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌ 

* సీట్లు: 620 - అర్హత: ఇంటర్‌తోపాటు మూడేళ్ల జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) డిప్లొమాను పూర్తి చేసి ఉండాలి. ఆర్‌ఎన్‌ఆర్‌ఎం (రిజిస్టర్డ్‌ నర్సెస్‌ అండ్‌ రిజిస్టర్డ్‌ మిడ్‌వైఫ్‌ సర్వీస్‌)లో రెండు-ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. - ప్రోగ్రాం వ్యవధి: మూడేళ్లు   (గరిష్ఠకాలం- ఐదేళ్లు) ఫీజు: రూ.20,000 (సంవత్సరానికి) 

* ప్రవేశ పరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష. ఇందులో 120 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. సమయం: రెండున్నర గంటలు. 

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.. 

చివరి తేదీ: ఏప్రిల్‌ 17.

పరీక్ష తేదీ: మే 8.

వెబ్‌సైట్‌: http://ignou.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని