నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 12 Apr 2022 00:44 IST

ఎన్‌టీఆర్‌ఓలో 206 ఐటీ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 206

పోస్టులు: సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌, రిస్క్‌ అనలిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: క్వాలిటీ అండ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ మెథడ్‌ (క్యూసీబీఎస్‌) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 22.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 16.

వెబ్‌సైట్‌: https://ntro.gov.in/


ఉద్యోగాలు

ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌- ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్లు మొత్తం ఖాళీలు: 30

విభాగాలు: కాంప్లియన్స్‌, లీగల్‌, రాజ్‌భాష, ఐటీ, హ్యూమన్‌ రిసోర్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: వివిధ విభాగాల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ/ పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 28.

వెబ్‌సైట్‌: www.eximbankindia.in/


ప్రవేశాలు

టీఎస్‌ పీఈసెట్‌-2022

తెలంగాణ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి టీఎస్‌ పీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

* తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌పీఈసెట్‌)-2022

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం లేకుండా): 2022, జూన్‌ 18.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ తేదీలు: 2022, ఆగస్టు 22.

వెబ్‌సైట్‌: https://pecet.tsche.ac.in/


ఏపీ ఈఏపీసెట్‌-2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఏపీ ఈఏపీసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2022 విద్యాసంవత్సరానికిగాను ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ -2022)

కోర్సులు: ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, బీటెక్‌, బీఎస్సీ, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మ్‌ డి.

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 10.

పరీక్ష తేదీలు: 2022, జులై 04-12 వరకు.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని