225 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన అణుశక్తినగర్‌ (ముంబయి)లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Apr 2022 01:33 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన అణుశక్తినగర్‌ (ముంబయి)లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు మొత్తం ఖాళీలు: 225 విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌)/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2020/ 2021/ 2022 మెరిట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 13. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 28.

వెబ్‌సైట్‌: www.npcilcareers.co.in/


నీలిట్‌లో 98 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌), దిల్లీ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 98 పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొగ్రామర్లు, అసిస్టెంట్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్లు, సీనియర్‌ ప్రొగ్రామర్, సిస్టమ్‌ అనలిస్టులు తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 20. 

వెబ్‌సైట్‌: www.nielit.gov.in/


సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌లో...

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్టులు  మొత్తం ఖాళీలు: 25 విభాగాలు: ఫిజిక్స్‌/ అప్లైడ్‌ ఆప్టిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రికల్‌/ కెమిస్ట్రీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 23.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 23. దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, మే 30. చిరునామా: సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌), న్యూదిల్లీ.

వెబ్‌సైట్‌: www.nplindia.org/


ఐసీహెచ్‌ఆర్, న్యూదిల్లీలో..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (ఐసీహెచ్‌ఆర్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్స్‌ (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 80 అర్హత: హిస్టారికల్‌ స్టడీస్‌ సబ్జెక్టులో పీహెచ్‌డీ ప్రోగ్రాం చదవడానికి రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 06. దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, మే 17.

వెబ్‌సైట్‌: http://ichr.ac.in/


సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో..

లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 40 పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీసీఏ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/ గేట్‌ అర్హత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18.

వెబ్‌సైట్‌: https://cdri.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని