ఆర్కిటెక్చర్‌లో.. ప్రవేశాలకు నాటా

ఆర్కిటెక్చర్‌లో రాణించాలనుకునే విద్యార్థుల కోసం నాటా (నేషనల్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఐదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ.ఆర్క్‌) కోర్సులో చేరొచ్చు.

Published : 13 Apr 2022 01:33 IST

ఆర్కిటెక్చర్‌లో రాణించాలనుకునే విద్యార్థుల కోసం నాటా (నేషనల్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఐదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ.ఆర్క్‌) కోర్సులో చేరొచ్చు.

ఈ ఏడాది మూడు దశల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక విద్యార్థి మూడుసార్లూ పరీక్ష రాయొచ్చు. రెండుసార్లు కనుక రాస్తే రెండింటిలో ఏది మంచి స్కోరు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మూడుసార్లూ రాస్తే రెండు మంచి స్కోర్ల సగటును ఫైనల్‌ స్కోర్‌గా పరిగణిస్తారు.

అర్హత: ప్లస్‌టూలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్‌ చదివి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా విద్యార్థులైతే మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది పరీక్ష రాసేవారూ అర్హులే.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు 125 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. 3 గంటల్లో జవాబులు రాయాలి. 

సిలబస్‌: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, జామెట్రీ, న్యూమరికల్, వెర్బల్, లాజికల్‌ రీజనింగ్, కలర్‌ థియరీ, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ డిజైన్‌తోపాటూ లాంగ్వేజ్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌పై ప్రశ్నలుంటాయి. గ్రాఫిక్స్, బిల్డింగ్, మెటీరియల్‌పై కూడా అవగాహన ఉండాలి. 

అప్లికేషన్‌ ఫీజు: జనరల్, ఓబీసీ అబ్బాయిలకు రూ.2000/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, అన్ని కేటగిరీల అమ్మాయిలకు రూ.1500/-.

పరీక్ష తేదీలు: జూన్‌ 12, జులై 3, 24. 

వెబ్‌సైట్‌: www.nata.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని