నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 18 Apr 2022 04:15 IST

ఉద్యోగాలు

బీఐఎస్‌లో 348 పోస్టులు

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 348 పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు. విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, మైక్రోబయోలజీ, కార్పెంటర్‌, వెల్డర్‌, ప్లంబర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ  ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022 ఏప్రిల్‌ 19. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 09.

వెబ్‌సైట్‌: https://www.bis.gov.in/


సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో...

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (సీఆర్‌ఐఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 150 1) అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు: 144 2) అసిస్టెంట్‌ డేటా అనలిస్టులు: 06 విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌. ఎంపిక విధానం: గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 25. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 24.

వెబ్‌సైట్‌: https://cris.org.in/


ప్రవేశాలు

మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ/ తత్సమాన కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) మే 2022 ప్రకటన విడుదలైంది. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: ఇంటర్నెట్‌ బేస్డ్‌ / పేపర్‌ బేస్డ్‌/ కంప్యూట్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్ష తేది: 2022, మే 15. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 09.

వెబ్‌సైట్‌: https://mat.aima.in/may22/


ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ స్కీం

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఎస్సీ/ ఇతర విద్యార్థులకు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం స్కాలర్‌షిప్స్‌: 26.50 లక్షలు అర్హులు: 1) ఎస్సీ విద్యార్థులు 2) అర్హులైన ఇతర విద్యార్థులు అర్హత: తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులు, ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్థులు అర్హులు. స్కాలర్‌షిప్‌ మొత్తం: ఎస్సీ విద్యార్థులకు ఏడాదికి రూ. 3500 నుంచి రూ.7000, ఇతర విద్యార్థులకు ఏడాదికి రూ. 3500 నుంచి రూ.8000 చెల్లిస్తారు. దివ్యాంగ్‌జన్‌ విద్యార్థులకు మరో 10 శాతం అదనపు అలవెన్సు అందజేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: వెల్లడించాల్సి ఉంది.

https://socialjustice.gov.in/


ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాములు

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్స్‌లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రాములు: బీఎస్సీ బీఈడీ(నాలుగేళ్లు), బీఏ బీఈడీ (నాలుగేళ్లు), ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్‌(ఆరేళ్లు), బీఈడీ(రెండేళ్లు), బీఈడీ-ఎంఈడీ (రెండేళ్లు), ఎంఈడీ(రెండేళ్లు). ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 20. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30. పరీక్ష తేది: 2022, జులై 24.

https://cee.ncert.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు