ఏపీపీఎస్సీ- అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టులు

 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 12 Oct 2022 11:47 IST

 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ కన్జర్వేటర్లు

మొత్తం ఖాళీలు: 09

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 20. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 10.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ఎయిమ్స్, మంగళగిరిలో..

మంగళగిరి(ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 07

పోస్టులు: రిసెర్చ్‌ సైంటిస్టులు, రిసెర్చ్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 26.

వెబ్‌సైట్‌: www.aiimsmangalagiri.edu.in/


ఐఐఐటీ, బెంగళూరులో ఎమ్మెస్సీ ప్రోగ్రాం 

బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (డిజిటల్‌ సొసైటీ)

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు జాతీయ అర్హత పరీక్షల స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 15.

రాత పరీక్ష తేది: 2022, జూన్‌ 04.

వెబ్‌సైట్‌: www.iiitb.ac.in/


సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీలో...

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 28

కేటగిరీల వారీగా ఖాళీలు: బయాలజీ గ్రూప్‌-18, కెమిస్ట్రీ గ్రూప్‌-10. విభాగాలు: కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ బయాలజీ తదితరాలు.

అర్హత: కెమిస్ట్రీ/ బయాలజీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ-నెట్‌/ జేఆర్‌ఎఫ్‌ అర్హత. ఎమ్మెస్సీ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

వాక్‌ఇన్‌ తేది: 2022, మే 04.

వేదిక: జేసీరే ఆడిటోరియం, జాదవ్‌పూర్‌ క్యాంపస్, ఐఐసీబీ, కోల్‌కతా. 

వెబ్‌సైట్‌:  www.career.iicb.res.in/ 


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో..

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 96

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 21.

వెబ్‌సైట్‌: www.hindustancopper.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని