నోటీస్‌బోర్డు

యూపీఎస్సీ కేంద్ర సాయుధ బలగాల్లో  అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి సీఏపీఎఫ్‌-2022 ప్రకటన విడుదల చేసింది.

Published : 21 Apr 2022 01:58 IST

ఉద్యోగాలు

సీఏపీఎఫ్‌ ఎగ్జామ్‌

యూపీఎస్సీ కేంద్ర సాయుధ బలగాల్లో  అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి సీఏపీఎఫ్‌-2022 ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 253

విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌-66, సీఆర్‌పీఎఫ్‌-29, సీఐఎస్‌ఎఫ్‌-62, ఐటీబీపీ-14, ఎస్‌ఎస్‌బీ-82.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2022లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ధిష్ఠ శారీరక  ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.08.2022 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 10.

పరీక్ష తేది: 2022, ఆగస్టు 07.

www.upsc.gov.in/


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో...

న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు మొత్తం ఖాళీలు: 145 పోస్టులు-ఖాళీలు: మేనేజర్లు (రిస్క్‌)-40, మేనేజర్లు (క్రెడిట్‌)-100, సీనియర్‌ మేనేజర్లు (ట్రెజరీ)-05

అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ (లేదా) గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 22.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 07.

పరీక్ష తేది: 2022, జూన్‌ 12. www.pnbindia.in/


ప్రవేశాలు

ఎన్‌ఆర్‌టీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు

వడోదరలోని నేషనల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఆర్‌టీఐ) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములు: బీబీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు: ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ, రైల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. బీటెక్‌కు జేఈఈ మెయిన్స్‌2022 స్కోర్‌ ఉండాలి.

వయసు: 01 జులై 2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములు: ఎంబీఏ, ఎమ్మెస్సీ

కోర్సులు: లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ అండ్‌ పాలిసీ తదితరాలు.

అర్హత: మ్యాథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్‌-2022, సీయూఈటీ-యూజీ /పీజీ 2022 , క్యాట్‌/గ్జాట్‌/ మ్యాట్‌ స్కోర్స్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

బీబీఏ, బీఎస్సీ ప్రోగ్రాంలకు చివరి తేది: 2022, మే 06.

బీటెక్‌ ప్రోగ్రాంలకు చివరి తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: www.nrti.edu.in/


ఐసీఎస్‌ఐ-సీఎస్‌ఈఈటీ ఎగ్జామ్‌ 2022

భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) జులై 2022 సెషన్‌కు గాను సీఎస్‌ఈఈటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* ఐసీఎస్‌ఐ - కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఎస్‌ఈఈటీ)

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (సీఎస్‌ఈఈటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 15.

సీఎస్‌ఈఈటీ 2022 పరీక్ష తేది: 2022, జులై 09.

వెబ్‌సైట్‌: www.icsi.edu/


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 696

రెగ్యులర్‌ పోస్టులు: 594

ఒప్పంద (కాంట్రాక్ట్‌)పోస్టులు: 102

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 26.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 10.

వెబ్‌సైట్‌: www.bankofindia.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని