నోటిఫికేషన్స్‌

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

Published : 26 Apr 2022 01:48 IST

ఉద్యోగాలు

తెలంగాణలో 16614 పోలీస్‌ ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కానిస్టేబుల్‌ పోస్టులు: 16027 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)

పోస్టులు: 587

విభాగాలు: సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌, జైల్‌ వార్డర్లు తదితరాలు.

అర్హత: కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ) అండ్‌ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), మెయిన్‌ (ఫైనల్‌) రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 02.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20.

వెబ్‌సైట్‌: ‌ www.tslprb.in/


యూపీఎస్సీ-67 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 67

పోస్టులు: అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 12.

వెబ్‌సైట్‌: ‌www.upsc.gov.in/


ఈపీఐఎల్‌లో 93 పోస్టులు

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ (ఈపీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 93

పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్‌ (మెకానికల్‌)-01, అసిస్టెంట్‌ మేనేజర్లు-60, మేనేజర్లు-26, సీనియర్‌ మేనేజర్లు-06. విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌, లీగల్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, ఎల్‌ఎల్‌బీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 11.

వెబ్‌సైట్‌: https://epi.gov.in/content/


ఎన్‌పీఎల్‌లో సైంటిస్టులు

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టులు

మొత్తం ఖాళీలు: 25

విభాగాలు: ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 30.

వెబ్‌సైట్‌:  www.nplindia.org/


సదరన్‌ కమాండ్‌లో 58 పోస్టులు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ కింది గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హెల్త్‌ ఇన్‌స్పెక్టర్స్‌

మొత్తం ఖాళీలు: 58

అర్హత: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 06.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


అప్రెంటిస్‌షిప్‌

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌లో...

వర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెస్‌కి చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 44

అప్రెంటిస్‌లు-ఖాళీలు:  ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌-18, ప్లేట్‌ మేకర్‌ (లిథోగ్రాఫిక్‌)-02, బుక్‌ బైండర్‌-24.

అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 14 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://www.dop.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని