నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 12 Oct 2022 11:46 IST

ఉద్యోగాలు
ఆయుష్‌-సీసీఆర్‌ఏఎస్‌లో...

న్యూదిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 310  

పోస్టులు: ఆయుర్వేద స్పెషలిస్టులు, ఆయుర్వేద జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, ఆయుర్వేద ఫార్మసిస్టులు, పంచకర్మ థెరపిస్టులు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 05. రాత పరీక్ష తేది: 2022, మే 15. 

వెబ్‌సైట్‌: http://ccras.nic.in/


స్పోర్ట్స్‌ అథారిటీలో...

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

యంగ్‌ ప్రొఫెషనల్స్‌ (జనరల్‌ మేనేజ్‌మెంట్‌)

మొత్తం ఖాళీలు: 50  

అర్హత: ఏదైనా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 27.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 12.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/sai/


ఎన్‌టీపీసీలో..

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 15

విభాగాల వారీగా ఖాళీలు: సోలార్‌ పీవీ-05, డేటా అనలిస్ట్‌-01, ఎల్‌ఏ/ ఆర్‌ అండ్‌ ఆర్‌-09.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 29.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 13.  వెబ్‌సైట్‌:www.ntpc.co.in/


ప్రవేశాలు

నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో...

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన గాంధీనగర్‌ (గుజరాత్‌) ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) 2022-23 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: స్కూల్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, స్కూల్‌ ఆఫ్‌ మెడికో లీగల్‌ స్టడీస్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ, స్కూల్‌ ఆఫ్‌ లా, ఫోరెన్సిక్‌ జస్టిస్‌ అండ్‌ పాలిసీ స్టడీస్‌ తదితరాలు.

కోర్సులు: ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీటెక్‌ - ఎంటెక్‌ తదితరాలు.

అందిస్తున్న ప్రాంగణాలు: గాంధీనగర్‌, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్‌ క్యాంపస్‌లు

అర్హత: ప్రోగ్రాంలను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రోగ్రాంలను అనుసరించి మెరిట్‌ మార్కులు, ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 10.

వెబ్‌సైట్‌: https://www.nfsu.ac.in/


ఏపీ ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌- 2022

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌-2022 ప్రకటన విడుదల చేసింది.

ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌, డిగ్రీ కాలేజ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌)

అర్హత: ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం ఏప్రిల్‌/ మే 2022లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మే 2022లో జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 28. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20.

ప్రవేశ పరీక్ష తేది: 2022, జూన్‌ 05.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని