Published : 28 Apr 2022 01:46 IST

ఎస్‌బీఐ-35 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

ఉద్యోగాలు

ఎస్‌బీఐ-35 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు : ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు 

మొత్తం ఖాళీలు: 35 (రెగ్యులర్‌-07,  ఒప్పంద పోస్టులు-28)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 17.

ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది: 2022, జూన్‌ 25. https://sbi.co.in/


హెచ్‌యూఆర్‌ఎల్‌లో 179 పోస్టులు 

ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: మొత్తం ఖాళీలు: 179 విభాగాలు: మార్కెటింగ్, సేఫ్టీ, ఫైర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితరాలు. పోస్టులు: చీఫ్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 11.

వెబ్‌సైట్‌: www.hurl.net.in/


ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఈలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ (ఎన్‌ఐఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్టులు, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ జూనియర్‌ నర్సు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్‌బీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 2022, మే 06.

వెబ్‌సైట్‌: https://nie.icmr.org.in/


ప్రవేశాలు

ఇండియన్‌ ఆర్మీ  బీఎస్‌సీ (నర్సింగ్‌) 

ఇండియన్‌ ఆర్మీకి చెందిన జాయిన్‌ మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ 2022 సంవత్సరానికి గాను కింది కోర్సులో ప్రవేశాలకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

బీఎస్‌సీ (నర్సింగ్‌) కోర్సు 2022

కోర్సు వ్యవధి: నాలుగు సంవత్సరాలు. అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, నీట్‌ (యూజీ) 2022లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 11.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


అప్రెంటిస్‌షిప్‌

ఓఎన్‌జీసీలో 3614 ఖాళీలు 

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 3614 (సదరన్‌ సెక్టర్‌-694) ట్రేడులు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఫిట్టర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 15.    
వెబ్‌సైట్‌: www.ongcindia.com/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని