Govt Jobs: బీఐఎస్‌లో 276 పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) 276 గ్రూప్‌ ఏ, బి, సి కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రధాన కేంద్రం దిల్లీతోపాటు దేశమంతటా పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలతో ఉన్నత స్థాయి జీతాలను అందుకునే అవకాశం ఉంది!

Updated : 02 May 2022 06:35 IST

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) 276 గ్రూప్‌ ఏ, బి, సి కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రధాన కేంద్రం దిల్లీతోపాటు దేశమంతటా పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలతో ఉన్నత స్థాయి జీతాలను అందుకునే అవకాశం ఉంది!

పోస్టుల వివరాలు..
గ్రూప్‌ ఏ: డైరెక్టర్‌ (లీగల్‌) - 1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (హిందీ) - 1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌ అండ్‌ ఫైనాన్స్‌) - 1, అసిసెంట్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) - 1
గ్రూప్‌ బి: పర్సనల్‌ అసిస్టెంట్‌ - 28

అసిస్టెంట్‌ (కంప్యూటర్‌ - ఎయిడెడ్‌ డిజైన్‌) - 2

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ - 47, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ల్యాబొరేటరీ) (47) - మెకానికల్‌ (19), కెమికల్‌ (18), మైక్రోబయాలజీ (10) 

గ్రూప్‌ సి: స్టెనోగ్రాఫర్‌ - 22, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ - 100, హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌ - 1, సీనియర్‌ టెక్నీషియన్‌ (25) - కార్పెంటర్‌ (6), వెల్డర్‌ (2), ప్లంబర్‌ (3), ఫిట్టర్‌ (3), టర్నర్‌ (5), ఎలక్ట్రీషియన్‌ (6).

పరీక్ష కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్‌ - విశాఖపట్నం, విజయవాడ; తెలంగాణ - హైదరాబాద్‌.  
పరీక్ష విధానం: డిగ్రీ స్థాయిలో ఉండే ప్రశ్నపత్రంలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (50 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (25), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (25), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ (50) విభాగాలుంటాయి. మొత్తం 150 మార్కుల పేపర్‌ను 2 గంటల్లో పూర్తి చేయాలి. (డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరక్టర్‌ వంటి గ్రూప్‌ 1 స్థాయి పోస్టుల ప్రశ్నపత్రం పీజీ స్థాయిలో ఉంటుంది.)

స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికయ్యేందుకు రాత పరీక్షలో కనీసం 50% మార్కులు సాధించాలి.

ఎలా చదవాలి.. 
సాధారణంగా ఈ ప్రశ్నపత్రం కఠినత్వం స్థాయి సులభం నుంచి మధ్యస్థంగా ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలి. పాత ప్రశ్న పత్రాలు స్టడీ చేయడం వల్ల ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. అంశాలవారీగా బేసిక్స్‌ను పూర్తిగా చదువుకున్నాకే మోడల్‌పేపర్లు సాల్వ్‌ చేయడం మొదలుపెట్టాలి. దానికి తగ్గట్టు ప్రిపేర్‌ అవ్వాలి. సొంతనోట్సును సమయానుసారం రివిజన్‌ చేయడం వల్ల ప్రశ్నలను తొందరగా గుర్తించి జవాబు ఇవ్వగలుగుతారు. సరైన మెటీరియల్‌ ఒకటే ఎంచుకుని దాన్నే అనుసరించడం మంచిది.

దరఖాస్తు స్వీకరణ: ఏప్రిల్‌ 19 నుంచి..

చివరితేదీ: మే 9. పరీక్ష: జులై, 2022 

వయసు: 27 ఏళ్ల నుంచి 56 ఏళ్లు. 

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ప్రత్యేక అర్హతలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుకు - 800/. ఇతర పోస్టులకు    రూ.500/. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.

ఎంపిక : ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ లేదా కంప్యూటర్‌ 

ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ద్వారా..

వేతనం : గ్రూప్‌ ఏ లో డైరక్టర్‌ పోస్టు వేతనశ్రేణి రూ.78,800-2,09,200 వరకూ, మిగతా వాటికి రూ.56,100-1,77,500 వరకూ ఉంటుంది. అదే గ్రూప్‌ బి అయితే రూ.35,400-1,12,400గా నిర్ణయించారు. గ్రూప్‌ సి పోస్టులకు రూ.25,500-81,100గా ఉంటుంది.

వివరాలకు వెబ్‌సైట్‌: ‌www.bis.gov.in


ఐఐఎఫ్‌టీలో.. ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) కాకినాడ క్యాంపస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు చదివేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2020 నూతన విద్యావిధానాన్ని అనుసరించి యువతను మేనేజ్‌మెంట్‌ నిపుణులుగా తీర్చిదిద్దేలా ఈ కోర్సు ఉంటుంది.

ఇందులో మొదటి మూడేళ్లు పూర్తిచేసిన విద్యార్థులకు ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌’ డిగ్రీ అందుతుంది. ఈ మూడేళ్లు సెమిస్టర్‌ విధానంలో మొత్తం 160 క్రెడిట్స్‌ ఉంటాయి. ఆఖరి రెండేళ్లు ట్రైమిస్టర్‌ విధానంతో 120 క్రెడిట్లు ఉంటాయి. మొత్తం కోర్సులో ఉండే క్రెడిట్లు 280. ఐదేళ్ల కోర్సు పూర్తిచేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) పట్టా అందుతుంది. కేస్‌ స్టడీస్‌, ప్రాజెక్ట్స్‌, ప్రెజెంటేషన్స్‌, గేమ్స్‌, రోల్‌ప్లే, ఫీల్డ్‌ విజిట్‌, ఇండస్ట్రీ సెషన్స్‌ వంటి మెథడాలజీస్‌తో బోధన ఉంటుంది. జేఎన్‌టీయూ కాకినాడలో ఉన్న ఐఐఎఫ్‌టీ తాత్కాలిక క్యాంపస్‌లో వచ్చే సెప్టెంబర్‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

మొత్తం సీట్లు: 40
ఎంపిక విధానం: ఐపీమ్యాట్‌ - 2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అకడమిక్‌ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హత: అభ్యర్థి ఇంటర్‌, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమేటిక్స్‌ను కచ్చితంగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
ఇతర వివరాలకు.. వెబ్‌సైట్‌: ‌www.iift.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని