Published : 04 May 2022 03:33 IST

ఉద్యోగాలు

ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో 332 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన గాంధీనగర్‌ (గుజరాత్‌)లోని నేషనల్‌ ఫోరెన్సికల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 332 టీచింగ్‌

పోస్టులు: 193 ( ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు)

నాన్‌ టీచింగ్‌ పోస్టులు: 139 (ఫైనాన్స్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ తదితరాలు)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

www.nfsu.ac.in/


నిజామాబాద్‌ జిల్లాలో

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పల్లెదవఖానాల్లో 1677 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో 101 పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 101

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేది: 2022, మే 05.

వేదిక: ప్రగతి భవన్‌, కలెక్టరేట్‌, నిజామాబాద్‌, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://nizamabad.telangana.gov.in/


ప్రవేశాలు

నిక్‌మార్‌లో పీజీ ప్రోగ్రాములు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మార్‌) కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్‌

కాల వ్యవధి: రెండేళ్లు/ ఏడాది

1) అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ 2) ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 3) రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ 4) మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ 5) క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 6) హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ 7) లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ 8) ఎనర్జీ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ఆధారంగా.

పరీక్ష తేదీలు: 2022, జూన్‌ 04, 05. గ్రూప్‌ డిస్కషన్‌

పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 జూన్‌ 07, 08.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 2022, మే 26.

వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని