నోటిఫికేషన్స్
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1271 ఉద్యోగాలు
తెలంగాణ (హైదరాబాద్)లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1271 పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-70, సబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-201, జూనియర్ లైన్మెన్లు-1000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 11.
వెబ్సైట్: https://tssouthernpower.cgg.gov.in/
ఓఎన్జీసీలో 922 పోస్టులు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 922 పోస్టులు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్, ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 28. www.ongcindia.com/
బీఈసీఐఎల్‌లో 86 డేటా ఎంట్రీ ఆపరేటర్లు
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దరఖాస్తులు కోరుతోంది.
* డేటా ఎంట్రీ ఆపరేటర్లు
మొత్తం ఖాళీలు: 86 అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 22. www.becil.com/
ప్రవేశాలు
టీఎస్ పాలిసెట్ -2022
హైదరాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్- 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంజినీరింగ్/ నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 04.
పరీక్ష తేది (పాలిసెట్ -2022): 2022, జూన్ 30.
వెబ్సైట్: https://polycetts.nic.in/
ఏపీపీజీఈసెట్-2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2022-23 విద్యాసంవత్సరానికి ఏపీపీజీఈసెట్ ప్రకటన విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.
* ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈసెట్ 2022)
అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ)
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 11.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 14.
పరీక్ష తేదీలు: 2022, జులై 18-20. వెబ్సైట్: https://sche.ap.gov.in/
ఏపీ ఈసెట్ నోటిఫికేషన్
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ 2022-23 విద్యాసంవత్సరానికి బీఈ/బీ.టెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈసెట్) ప్రకటన వెలువరించింది.
అర్హత: గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ/ ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్ల బీఎస్సీ డిగ్రీలో మ్యాథమేటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఏపీఈసెట్ రాయొచ్చు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-, బీసీ అభ్యర్థులకు రూ.550/-, ఓసీ అభ్యర్థులకు రూ.600/-.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో... పరీక్ష సమయం: 3 గంటలు, రెండు పేపర్లు... ఉదయం (9 నుంచి 12 వరకు), మధ్యాహ్నం (3 నుంచి 6 వరకు)
ఎంపిక విధానం: అర్హత మార్కులు: బీఎస్సీ (మ్యాథమేటిక్స్)కు 200 మార్కులకు గానూ 25 శాతం ఉత్తీర్ణత సాధించడం అవసరం, అంటే కనీసం 50 మార్కులు పొందాలి.
అందిస్తున్న కోర్సులు: బయోటెక్నాలజీ, సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫార్మసీ.
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఒక్కో విభాగానికి 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి.
మొత్తం మార్కులు: 200 సిలబస్... ఇంజినీరింగ్: 200 మార్కులకుగానూ... మ్యాథమేటిక్స్ (50 మార్కులకు), ఫిజిక్స్(25 మార్కులకు), కెమిస్ట్రీ(25 మార్కులకు)... మిగతా 100 మార్కులకు ఇంజినీరింగ్ సజ్జెక్టుపై ప్రశ్నలడుగుతారు. ఒక్కో బ్రాంచ్ (అగ్రికల్చరల్/ బయోటెక్నాలజీ/ సిరామిక్ టెక్నాలజీ/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ మెకానికల్/ మెటలర్జికల్/ మైనింగ్ ఇంజినీరింగ్)కు విడిగా ప్రశ్నపత్రం ఉంటుంది.
ఫార్మసీ: ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ... ఒక్కోదానికి 50 చొప్పున 200 ప్రశ్నలడుగుతారు. బీఎస్సీ: మ్యాథమేటిక్స్ (100 మార్కులకు), ఎనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్‌లకు 50 చొప్పున 100 ప్రశ్నలుంటాయి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 3
https:// cets.apsche.ap.gov.in/ECET
పరీక్ష : జులై 22
ప్రిలిమినరీ కీ విడుదల: జులై 25
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు