నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌), ముంబయి సెంటర్‌ ఒప్పంద

Published : 12 May 2022 01:43 IST

ఉద్యోగాలు
సీ-డ్యాక్‌లో 101 టెక్నికల్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌), ముంబయి సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 101  పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రోగ్రాం మేనేజర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 24. వెబ్‌సైట్‌: https://careers.cdac.in/


ఆర్మీ-136 టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

ఇండియన్‌ ఆర్మీ జనవరి 2023లో ప్రారంభమయ్యే 136వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

136వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)-జనవరి 2023

మొత్తం ఖాళీలు: 40 విభాగాలు: సివిల్‌, ఆర్కిటెక్చర్‌, మెకానికల్‌, ఐటీ, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.01.2023 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 09.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


ఏపీఎండీసీ, విజయవాడలో...

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34  పోస్టులు: జనరల్‌ మేనేజర్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు.

విభాగాలు: కోల్‌, లీగల్‌, ఐటీ, మైనింగ్‌.

అర్హత:  పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, లా డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 27.

వెబ్‌సైట్‌: https://apmdc.ap.gov.in/


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో...

భారత ప్రభుత్వానికి చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 13 విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌-05, కమర్షియల్‌-08.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 06.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


వాక్‌ఇన్‌

ఎయిమ్స్‌, మంగళగిరిలో....

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మంగళగిరి (ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు

మొత్తం ఖాళీలు: 11 విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, న్యూరాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేది: 2022, మే 26.

వేదిక: గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఏపీ-522503.

వెబ్‌సైట్‌:www.aiimsmangalagiri.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని