నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింది వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోం

Updated : 17 May 2022 00:50 IST

ఉద్యోగాలు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 261 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింది వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 261

పోస్టులు: సీనియర్‌ షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్లు, వెల్డర్‌ కమ్‌ ఫిట్టర్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరాలు.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 06.06.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 06.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


పవర్‌గ్రిడ్‌లో 75 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌లో నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 75

పోస్టులు-ఖాళీలు: ఫీల్డ్‌ ఇంజినీర్లు-35, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు-40

విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 29 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 01.

వెబ్‌సైట్‌: www.powergrid.in/


ఎస్‌ఎస్‌సీ-2065 సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) వివిధ కేటగిరీల్లో ఫేజ్‌-X సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 2065

పోస్టులు: నర్సింగ్‌ ఆఫీసర్లు, సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, ఎంటీఎస్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, ఆపై ఉత్తీర్ణత.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 13.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


యూపీఎస్సీ-50 ఖాళీలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 50 పోస్టులు: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌, సైంటిస్ట్‌ తదితరాలు. విభాగాలు: ఆయుర్వేద, బ్యాంకింగ్‌, రక్షణ రంగం, ఫైనాన్స్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ/ సీఏ/ సీఎఫ్‌ఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ ఎంఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 02. వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఏపీలో 40 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

మొత్తం ఖాళీలు: 40

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20.

చిరునామా: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, ఏపీ, గొల్లపూడి, విజయవాడ.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


ఐఐటీఎంలో రిసెర్చ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ (ఐఐటీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

పోస్టుల వారీగా ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌-15, రిసెర్చ్‌ ఫెలో-39

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ ఎమ్మెస్సీ/ ఎంఎస్‌/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ అర్హత.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 2022, జూన్‌ 27.

వెబ్‌సైట్‌: https://www.tropmet.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని