Updated : 17 May 2022 06:08 IST

BSF: బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ పోస్టులు

దేశ రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే యువత కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) మొత్తం 90 గ్రూప్‌ ‘బి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశం. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

30 ఏళ్ల వయసు మించని యువతీయువకులను బీఎస్‌ఎఫ్‌ ఆహ్వానిస్తోంది. ఇటీవలే కమాండెంట్‌ కొలువులకు నోటిఫికేషన్‌ రాగా... తాజాగా గ్రూప్‌ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌) - 1, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) - 57, జూనియర్‌ ఇంజినీర్‌/సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) - 32 ఖాళీలున్నాయి.

విద్యార్హతలు: ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌) పోస్టుకు ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ ఉండాలి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) పోస్టు కోసం సివిల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాసై ఉండాలి. జూనియర్‌ ఇంజినీర్‌/సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాసవ్వాలి. 

పరీక్ష విధానం: అన్ని పోస్టుల అభ్యర్థులకు తొలుత రాతపరీక్ష నిర్వహిస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ, శారీరక సామర్థ్య పరీక్ష పాసవ్వాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : జనరల్‌ అభ్యర్థులకు రూ.200/-, యువతులకు, ఎస్సీ, ఎస్టీ, సర్వీస్‌లో ఉన్నవారు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరితేదీ : జూన్‌ 8

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: rectt.bsf.gov.in

పరీక్ష విధానం: రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది, గంటన్నరలో పూర్తి చేయాలి. 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

రెండో పేపర్‌ కూడా 100 మార్కులకు ఉంటుంది, 2 గంటల్లో పూర్తి చేయాలి. 

ఎస్‌ఐ (వర్క్స్‌) - జనరల్‌ ఇంజినీరింగ్‌ (సివిల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు. 

(12 ప్రశ్నలు ఇస్తారు.. 10 ప్రశ్నలను ఎంచుకోవాలి.)

జేఈ/ఎస్‌ఐ (ఎలక్ట్రికల్‌) - జనరల్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు 

(12 ప్రశ్నలు ఇస్తారు.. 10 ప్రశ్నలను ఎంచుకోవాలి.)

రాతపరీక్ష పాసయ్యేందుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌: పురుష అభ్యర్థులు 165 సెం.మీ ఎత్తుండాలి. ఛాతీ శ్వాస పీల్చినప్పుడు 81 సెం.మీ, వదలినప్పుడు 76 సెం.మీ ఉండాలి. వైద్య ప్రమాణాలను అనుసరించి ఎత్తుకు తగిన బరువుండాలి. మహిళలైతే 157 సెం.మీ ఎత్తు, 46 కేజీలకు తగ్గకుండా బరువు ఉండాలి. 

ఎలా చదవాలి: ఈ ప్రశ్నపత్రం స్థాయి సాధారణంగా మధ్యస్థంగా ఉంటుంది. రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఉన్నా... అభ్యర్థి విజయంలో ఇంజినీరింగ్‌ సబ్జెక్టులదే కీలకపాత్ర. అందువల్ల సిలబస్‌ చూసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో అర్థమవుతుంది. పరీక్షకు సరిపడా సమయం ఉన్నందున అభ్యర్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధత మొదలుపెడితే విజయతీరాలకు చేరుకోవచ్చు. ఫిజికల్‌ టెస్ట్‌ ప్రామాణిక కొలతలకు సరిపోతున్నారో లేదో చూసుకుని అందుకు తగిన విధంగా డైట్‌ తీసుకోవాలి.  


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని