Updated : 17 May 2022 06:12 IST

ఆర్‌ఆర్‌సీఏటీలో 50 ఖాళీలు

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 50 పోస్టులు-ఖాళీలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్లు-29, టెక్నీషియన్లు-21. విభాగాలు: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌), ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 14. 

వెబ్‌సైట్‌: www.rrcat.gov.in/


ఆర్మీ- వెస్టర్న్‌ కమాండ్‌లో... 

ఇండియన్‌ ఆర్మీకి చెందిన వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు మొత్తం ఖాళీలు: 65 పోస్టులు: బార్బర్, చౌకీదార్, కుక్, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్, ట్రేడ్స్‌మెన్‌ మేట్, వాషర్‌మెన్, సఫాయివాలా. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు. 

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


డీఎంహెచ్‌ఓ, నెల్లూరులో... 

వైద్యారోగ్యశాఖ విభాగం నెల్లూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 31 పోస్టులు: ఎపిడిమియాలజిస్ట్, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్, మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 అర్హత: పోస్టుల్ని అనుసరించి డిప్లొమా (ఫార్మసీ), ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 18. చిరునామా: డీఎంహెచ్‌ఓ, నెల్లూరు జిల్లా, ఏపీ. 

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/


ప్రవేశాలు

ఐఆర్‌టీలో డిప్లొమా ప్రోగ్రాములు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఐఆర్‌టీ) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అందిస్తున్న కోర్సులు: ట్రాన్స్‌పోర్ట్‌ ఎకనమిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (కంటెయినరైజేషన్‌) అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌. అర్హత: ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30. 

వెబ్‌సైట్‌: https://irt.indianrailways.gov.in/


వాక్‌ఇన్‌ 

ఎన్‌హెచ్‌ఎం- తెలంగాణలో... 

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రాం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

డిస్ట్రిక్ట్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్లు

మొత్తం ఖాళీలు: 12 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు. వాక్‌ఇన్‌ తేది: 2022, మే 20. వేదిక: ది కమిషనర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అండ్‌ మిషన్‌ డైరెక్టర్, నేషనల్‌ హెల్త్‌ మిషన్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in/ 


గ్రాఫిక్‌ డిజైన్‌ 2డి వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌ 

సంస్థ: మోఈవీఇంగ్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: యానిమేషన్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/646e1d


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఐసీఆర్‌బీ కన్సల్టింగ్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మే 26,

ఎవరు అర్హులు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు.

 లింకు:  internshala.com/i/dcf2c7


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని