Published : 17 May 2022 04:58 IST

బహు భాషా కోవిదులవుతారా...!

ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకునే వారికి విదేశీ భాషలు చక్కని భవిత అందిస్తాయి. ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, జపనీస్, స్పానిష్, పోర్చుగీస్‌ వంటి పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారికి భారత్‌లోనే కాక, విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది.

భాషతోపాటు, వివిధ ప్రాంతాల్లో అనుసరించే సంస్కృతి, జీవనవిధానాన్ని తెలుసుకోగలిగే అవకాశం ఈ కోర్సుల ద్వారా లభిస్తుంది. ఏదైనా ఫారిన్‌ లాంగ్వేజ్‌తోపాటు ఇంగ్లిష్‌ మాట్లాడటంలోనూ పట్టు సాధిస్తే మీ కెరియర్‌కు ఇక తిరుగుండదు. సర్టిఫికెట్, డిప్లొమాలతో లాంగ్వేజ్‌ నిపుణులుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీల్లో ఉపాధి పొందే వీలుంది. ఫారిన్‌ లాంగ్వేజ్‌ స్పెషలిస్ట్, ఇంటర్‌ప్రిటర్, ట్రాన్స్‌లేటర్‌ల వంటి అత్యుత్తమ అవకాశాలు మీ సొంతం!

కోర్సు రకాలు: సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ 

కనీస విద్యార్హతలు: డిగ్రీ/ బీఎస్సీ చేయాలనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. బీ పీజీ/ ఎమ్మెస్సీ చేయాలనుకునేవారు మూడేళ్ల డిగ్రీలో ఏదైనా ఫారిన్‌ లాంగ్వేజ్‌ను చదివుండాలి. 

* పీహెచ్‌డీ చేయాలనుకునేవారు రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ను చదవాల్సి ఉంటుంది.

కావాల్సిన నైపుణ్యాలు: భాషలపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, కష్టపడేతత్వం, ఇంగ్లిష్‌పై పట్టు, టెక్నికల్‌ స్కిల్స్, ఇతర భాషా నైపుణ్యాలు. 

ప్రయోజనాలు: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఫారిన్‌ లాంగ్వేజ్‌ను కోర్సుగా చదివుండటం ఉపయుక్తం. కోరుకున్న అత్యున్నత యూనివర్సిటీ/ కళాశాలలో సులభంగా ప్రవేశం పొందేందుకు తోడ్పడుతుంది. ఇతర దేశాల్లో చదువుకునే సమయంలో ఈ లాంగ్వేజ్‌ నైపుణ్యాల వల్ల కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాకుండా ఉంటుంది. 

ఉద్యోగావకాశాలు: ఏర్‌ హోస్టెస్, కంటెంట్‌ రైటర్, ఎడిటర్, క్రిటిక్, టూరిస్ట్‌ గైడ్, టీచర్, ఫ్రీలాన్సర్, ట్రాన్స్‌లేటర్, ఫారిన్‌ లాంగ్వేజ్‌ ట్రైనర్‌ తదితరాలు.

ఏయే రంగాల్లో... హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్, పబ్లిక్‌ రిలేషన్స్, బీపీఓ, టీచింగ్, మాస్‌ కమ్యూనికేషన్, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది.  

జీతభత్యాలు: ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో భాషానిపుణులకు వార్షిక వేతనం భారత్‌లో సుమారుగా రూ.7.50 లక్షలుకాగా, విదేశాల్లో రూ.9.80 లక్షల వరకూ అందుతోంది. 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని