Published : 18 May 2022 06:13 IST

ఉద్యోగాలు

బెల్‌లో 55 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 55 పోస్టుల వారీగా ఖాళీలు: 1) ట్రెయినీ ఇంజినీర్‌ - 38 2) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-ఆఫీసర్‌ - 17 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, హెచ్‌ఆర్‌, సివిల్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000. ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.472, ట్రెయినీ ఇంజినీర్‌కు రూ.177 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 01, 2022.

వెబ్‌సైట్‌: ‌www.bel-india.in/Default.aspx


ఎస్‌వీపీఐఎస్‌టీఎంలో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన కోయంబత్తూరులోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌వీపీఐఎస్‌టీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అడ్మిషన్‌ కమ్‌ ప్లేస్‌మెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌ ఆఫీసర్‌. విభాగాలు: మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌. అర్హత: పోస్టులను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఏంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత. జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.50000. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఈమెయిల్‌: recruitment2022@svpitm.ac.in చిరునామా: ది డైరెక్టర్‌, ఎస్‌వీపీఐఎస్‌టీఎం, అవినాషి రోడ్‌, పీలమేడు, కోయంబత్తూరు-641004. దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 02, 2022.

వెబ్‌సైట్‌: http://svpistm.ac.in/


ఏపీఎస్‌-గోల్కొండలో..

హైదరాబాద్‌ (గోల్కొండ)లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16 పోస్టులు: టీజీటీ, పీఆర్‌టీ, అడ్మిన్‌ సూపర్‌వైజర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు. విభాగాలు: ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు. అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌/ రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్‌/ టెట్‌ అర్హులై ఉండాలి. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ గోల్కొండ, సన్‌సిటీ దగ్గర, హైదరాబాద్‌- 500031. దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 04, 2022.

వెబ్‌సైట్‌:  www.apsgolconda.edu.in/


ప్రవేశాలు
బిట్స్‌లో పీజీ ప్రోగ్రాములు

మెస్రా (రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌) 2022 విద్యాసంవత్సరానికి కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

బిట్స్‌లో పీజీ ప్రోగ్రాములు

ప్రోగ్రాములు: ఎంటెక్‌, ఎం.ఫార్మా, మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, ఎమ్మెస్సీ. విభాగాలు: ఏరోస్పేస్‌, బయోటెక్నాలజీ, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితరాలు. కోర్సు వ్యవధి: రెండేళ్లు. అర్హత: కోర్సులను అనుసరించి బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత. గేట్‌ 2020 లేదా 2021 స్కోర్‌ ఉండాలి. 2022లో తుది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: రాత పరీక్ష/ కౌన్సెలింగ్‌, ప్రోగ్రాములని అనుసరించి గేట్‌ /జీప్యాట్‌ / జామ్‌/ సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 07, 2022.

వెబ్‌సైట్‌:  https://bitmesra.ac.in/


వాక్‌ఇన్‌లు
ఐజీఎన్‌సీఏలో 25 పోస్టులు

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ద ఆర్ట్స్‌ (ఐజీఎన్‌సీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 25 పోస్టులు: కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, కంటెంట్‌ సూపర్‌వైజర్‌, బ్రాడ్‌కాస్ట్‌ అసిస్టెంట్‌, వీడియో ఎడిటర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. జీతభత్యాలు: నెలకు రూ.25000 నుంచి రూ.లక్ష. ఇంటర్వ్యూ వేదిక: వేదిక: జనపథ్‌ బిల్డింగ్‌, జన్‌పథ్‌, న్యూదిల్లీ-110001. వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మే 18-31.

వెబ్‌సైట్‌:  https://ignca.gov.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని